దిల్‌రాజుని త‌ప్పించుకుని తిరిగా: స‌మంత‌

96ని తెలుగులో రీమేక్ చేస్తార‌నుకున్న‌ప్పుడు క‌థానాయిక ఎవ‌రు? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. ఎందుకంటే త‌మిళంలో త్రిష అద్భుతంగా న‌టించేసింది. ఇప్పుడు తెలుగులో సినిమా వ‌స్తోందంటే, ఎవ‌రు ఎంత న‌టించినా, త్రిష‌తో పోలిక‌లు మొద‌లెట్టేస్తారు. ఏమాత్రం ఎక్కువ త‌క్కువ‌లు చేసినా దొరికిపోవ‌డం ఖాయం. అందుకే క‌థానాయిక‌లెవ‌రూ ఈ సినిమా చేయ‌డానికి ధైర్యం చేయ‌లేదు. కానీ స‌మంత ముందుకొచ్చింది. స‌మంత మాత్ర‌మే త్రిష పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌దు అని తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలుసు. ఎందుకంటే అంత‌కు ముందే `ఓ బేబీ`లో స‌మంత త‌న న‌ట విశ్వ‌రూపం చూపించేసింది. అందుకే స‌మంత‌పై అంత న‌మ్మెకం. కానీ స‌మంత ఈ సినిమాని అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. ముందు `నో` చెప్పింది. ఆ త‌ర‌వాత కండీష‌న్లు పెట్టింది. ఈ సినిమా ఎక్క‌డ ఒప్పుకోవాల్సివ‌స్తుందో అని కొన్ని రోజులు దిల్ రాజుని త‌ప్పించుకుని తిరిగింది. ఈ విష‌యం స‌మంతే చెప్పింది.

“త‌మిళంలో ఈ సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు చేస్తున్నార‌ని తెలిసింది. ఆయ‌న్నుంచి ఫోన్ వస్తే భ‌య‌ప‌డిపోయాను. `లేను.. ఒంట్లో బాలేద‌ని చెప్పు` అంటూ త‌ప్పించుకుని తిరిగాను. ఎందుకంటే త్రిష, విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ల్ని మ్యాచ్ చేయ‌డం చాలా క‌ష్టం. అందుకే చేయ‌కూడ‌ద‌నుకున్నా. అయితే దిల్ రాజుని క‌లిసిన వెంట‌నే.. ఈ సినిమా చేస్తున్నాన‌ని ఒప్పేసుకున్నా. ఆయ‌న ఒప్పించేశారు. హైద‌ర‌బాద్ రాగానే నేను అడుగు పెట్టింది ఆయ‌న ఆఫీసులోనే. ఆ అనుబంధంతోనే ఈ సినిమా చేశాను” అంది. అయితే స‌మంత మాత్రం చాలా కండీష‌న్లు పెట్టింది. మాతృక తీసిన ద‌ర్శ‌కుడిని తీసుకురావాల‌న్న‌ది తొలి కండీష‌న్‌. సంగీత ద‌ర్శ‌కుడినీ, కెమెరామెన్‌నీ అక్క‌డి నుంచే తీసుకొచ్చారు. ఇదంతా స‌మంత కోస‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close