ల‌క్ష్మ‌ణ్ స్థానంలో కొత్త అధ్య‌క్షుడు రాబోతున్నారా..?

మున్సిప‌ల్ ఎన్నిక‌లు అయిపోయాయి. దీంతో ఇప్పుడు భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడి మార్పు ఉంటుందా అనే చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టు స‌మాచారం. నిజానికి, ఈ చ‌ర్చ కొన్ని నెల‌ల కింద‌ట బాగా జోరుగానే సాగింది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడిగా ఉన్న ల‌క్ష్మ‌ణ్ ని మ‌రోసారి కొన‌సాగిస్తార‌నే అభిప్రాయమూ వ్య‌క్త‌మైంది. త‌న స్థానాన్ని నిలుపుకునేందుకు జాతీయ స్థాయిలో ఆయ‌నా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశార‌నే క‌థ‌నాలు వినిపించాయి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌రువాత ల‌క్ష్మ‌ణ్ కొన‌సాగింపు అనుమాన‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ప్ర‌స్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అవి పూర్తికాగానే రాష్ట్రాల్లో కొత్త అధ్య‌క్షుల ఎంపిక ప్ర‌క్రియ ప్రారంభమౌతుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో కూడా మార్పు ఉండొచ్చ‌ని భాజ‌పా వర్గాల్లో ఇప్పుడు చ‌ర్చ‌నీయం అవుతోంది.

తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో ల‌క్ష్మ‌ణ్ నాయ‌క‌త్వాన్ని మార్చాల‌నే అభిప్రాయం జాతీయ నాయ‌క‌త్వం ముందుకు రాష్ట్ర నేత‌లే తీసుకెళ్తున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న స్థానంలో కొత్తవారికి అవ‌కాశం క‌ల్పించాల‌నే డిమాండ్ మ‌రోసారి తెర‌మీదికి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ కొత్త‌వారు ఎవ‌రంటే… కాస్త బ‌లంగా వినిపిస్తున్న పేరు ఎంపీ బండి సంజ‌య్. ఈయ‌తోపాటు ముర‌ళీధ‌ర్ రావు, జితేంద‌ర్ రెడ్డి, డీకే అరుణ లాంటి కొంత‌మంది ఆశావ‌హులు కూడా జాబితాలో ఉన్నారు. అయితే, సంఘ్ పెద్ద‌ల ఆశీస్సులు సంజ‌య్ కి ఉన్నాయ‌నీ, ఆయ‌న పేరును ఇదివ‌ర‌కే వారు పార్టీకి సూచించిన‌ట్టుగా కూడా ఆ మ‌ధ్య క‌థ‌నాలు వినిపించాయి.

అధ్య‌క్షుడి మార్పు విష‌య‌మై ల‌క్ష్మ‌ణ్ ద‌గ్గ‌ర ప్ర‌శ్నిస్తే… అంతా అధిష్టానం అభీష్టం మేర‌కే నిర్ణ‌యాలు ఉంటాయ‌ంటూ దాటేస్తున్నారు. ల‌క్ష్మ‌ణ్ కొనసాగింపు కష్టం అనే చ‌ర్చ తెరమీదికి రావ‌డం వెన‌క మ‌రో కార‌ణం… గ‌డ‌చిన ప‌దిహేనేళ్ల‌లో భాజ‌పా అధ్య‌క్షుడిగా ఉంటూ వ‌చ్చిన‌వారంతా హైద‌రాబాద్ కి చెందిన నాయ‌కులు మాత్ర‌మే ఉన్నారు. దీంతో, తెలంగాణ‌లో పార్టీ విస్త‌ర‌ణ జ‌రగ‌లేద‌నే అభిప్రాయ‌ం జాతీయ నాయ‌క‌త్వానికి ఉంద‌ని తెలుస్తోంది. ఈసారి హైద‌రాబాద్ కి చెంద‌ని నాయ‌కుడికి బాధ్య‌త‌లు ఇస్తే ప‌రిస్థితి మారొచ్చు అనేది వారి నిర్ణ‌యంగా ఉంటుంద‌నీ అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలివే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , సాయంత్రం అనే తేడా లేకుండా భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మే నెల ప్రారంభమైన మొదటి రోజే భానుడు...

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close