ముంబై 26/11 దాడులకు ఏవిధంగా ప్రణాళికలు రచించామంటే…

26/11 ముంబై దాడులకు ముందు అందుకు అవసరమయిన మ్యాపులు, ఫోటోలు వంటి సమాచారాన్ని అంతా సేకరించి పాక్ లోని లష్కర్ ఉగ్రవాదులకు అందజేసిన ఇచ్చిన డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ముంబై దాడుల కేసులో అతను ‘అప్రూవర్’ మారడానికి అంగీకరించడంతో భారత్ అభ్యర్ధన మేరకు అమెరికా ప్రభుత్వం అతనిని ఈ కేసులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబై కోర్టు విచారించేందుకు అంగీకరించింది. నిన్న మొదటిరోజున ఆ దాడుల గురించి, వాటి సూత్రధారుల గురించి హెడ్లీ చాలా విషయాలు చెప్పాడు. మళ్ళీ ఈ రోజు విచారణలో ఇంకా దిగ్బ్రాంతికరమయిన విషయాలు బయటపెట్టాడు. ఆ వివరాలు:

2003 సం.లో నేను మొదటిసారిగా జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజహర్ ని పాకిస్తాన్ లో దక్షిణ లాహోరు ప్రాంతంలో కలిసాను. అదే సం.లో జాకీర్ ఉర్ర్ రెహ్మాన్ లక్వీని కూడా ముజఫరాబాద్ లో కలిసాను. అలాగే భారత్ కి మత్తుమందులు, ఆయుధాలు సరఫరా చేసే జేబ్ షా అనే వ్యక్తిని కూడా కలిసాను. మరికొందరు ఉగ్రవాదులను కూడా కలిసాను.నేను పాక్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ., పాక్ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేసేవాడిని. పాక్ ఆర్మీకి చెందిన అనేకమందిని నేను కలిసేవాడిని. అయితే వారి నుండి నాకు డబ్బు అందలేదు.

2006సం.లో నేను, లష్కర్ కి చెందిన ముజబిల్ బట్, సాజిద్ మీర్, అబూ ఖఫ్ఫాలతో సమావేశం అయ్యాము. ఆ సమావేశంలో భారత్ లో మా కార్యకలాపాలు సాగించేందుకుగాను ముంబైలో ఒక కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయం జరిగింది.

ఐ.ఎస్.ఐ.కి చెందిన మజర్ ఇక్బాల్ ముంబై నగరంలో ప్రముఖ ప్రాంతాలను వీడియో తీసి ఇమ్మని వారు కోరారు. అలాగే రెక్కి నిర్వహించి దానిని కూడా వీడియో తీసి అందించమని కోరారు. నన్ను భారత ఆర్మీకి సంబంధించిన వివరాలు కూడా సేకరించామని లష్కర్ ఉగ్రవాదులు కోరారు. అందుకోసం ఆర్మీలోనే తమ కోసం పనిచేయగల వ్యక్తిని గుర్తించమని కోరారు.

ముంబై లోని వివిధ ముఖ్యమయిన ప్రదేశాలను గుర్తించడానికి వారు నాకు జి.పి.ఎస్ పరికరాన్ని అందజేశారు. తాజ్ హోటల్, ఒబిరాయ్ హోటల్, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, ముంబైలోని మహారాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్, చత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్, లియోపోల్ద్ కేఫ్, కొలాబా పోలీస్ స్టేషన్, ఆ పరిసరాలలో ఉన్న ప్రముఖ షాపులు హోటల్స్, కొలబాలోని భగత్ సింగ్ మార్గ్ రోడ్డు తదితర ప్రాంతాలను వీడియో తీసి ఇచ్చేను. ముఖ్యంగా అక్కడ ఉన్న సిద్ది వినాయక మందిరం ఫోటోలను, వీడియోని తీసి ఇమ్మని వారు నన్ను కోరారు. నేను వారు కోరినట్లే అన్నీ తీసి లష్కర్ నేత సాజిద్ మీర్, ఐ.ఎస్.ఐ. అధికారి మేజర్ ఇక్బాల్ కి అందజేసాను.

అందుకోసం నేను ముంబైకి సెప్టెంబర్ 14, 2016లో మొట్ట మొదటి సారిగా వచ్చేను. నేను నా భార్య ఫైజా తో కలిసి తాజ్ హోటల్ రెండవ అంతస్తులో బస చేసాను. పాక్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ తహవ్వుర్ హుస్సేన్ రానా అనే వ్యక్తి నాకు స్కూల్లో స్నేహితుడు. అతని స్నేహితుడయిన బషీర్ షేక్ మేము ముంబై వచ్చినప్పుడు మమ్మల్ని ముంబై విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొన్నాడు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి నేను ముంబైలో అతను నాకు చాలా సహకరించాడు. దాడులు చేయడానికే ఈ సమాచారం అంతా సేకరిస్తున్నట్లు నాకు తెలుసు కానీ అప్పటికే ముంబై మీదే దాడులు చేయాలని లష్కర్ ఉగ్రవాదులు నిర్ణయించుకొన్నట్లు నాకు అప్పటికి ఇంకా తెలియదు. నేను ఉగ్రవాదుల కోసం పని చేస్తున్నాననే సంగతి నా భార్య ఫైజాకి తెలియగానే ఆమె ఇస్లామాబాద్ లోని అమెరికన్ ఎంబసీలో నాపై పిర్యాదు చేసింది.

మళ్ళీ 2007సం.లో ముజఫరాబాద్ లో గల లష్కర్ సంస్థ కార్యాలయంలో ఖఫ్ఫా మరియు మీర్ సమావేశమయ్యి నేను అందించిన తాజ్ హోటల్ ఫోటోలు, వీడియోల ఆధారంగా దాడులు చేయవలసిన ప్రాతాలను గుర్తించారు. ఆ హోటల్లో భారతీయ శాస్త్రవేత్తలు సమావేశం జరుగబోతున్న కాన్ఫరెన్స్ హాలు ఫోటోలను కూడా వారిరువురూ పరిశీలించి అక్కడ దాడులకు పాల్పడటం గురించి చర్చించుకొన్నారు. కానీ అక్కడికి ఆయుధాలతో చేరుకోవడం కష్టం అవుతుందని ఆ ఆలోచన విరమించుకొన్నారు.
లష్కర్, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహుద్దీన్ అనే మూడు ఉగ్రవాద సంస్థలు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే సంస్థ క్రింద పనిచేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

ఏపీ అల్ల‌ర్లు… ఇక అరెస్టులు మొద‌లు!

ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌పై ఏర్ప‌డిన సిట్ ప్రాథ‌మిక నివేదిక‌ను డీజీపీకి అందించింది. రెండు రోజుల పాటు అల్ల‌ర్లు జ‌రిగిన ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, అల్ల‌ర్ల వెనుకున్న కార‌ణాలు... అల్ల‌ర్ల వెనుకున్న నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close