నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో నితిన్ ఒక‌డు. చాలా కాలం నుంచి ‘ఈ యేడాదే పెళ్లి చేసుకుంటా..’ అంటూ ఊరిస్తున్నాడు. అయితే ఈ మాట‌ని ఈ యేడాది మాత్రం నిజం చేసేసుకుంటున్నాడు. నితిన్ పెళ్లి కుదిరింది. ఈ ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి చేసుకుంటున్నాడు. త‌న‌ది ప్రేమ పెళ్లి. లండ‌న్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చ‌దివిన షాలినితో కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు నితిన్‌. ఈ ప్రేమ పెద్ద‌ల‌కు తెలిసి, వాళ్లూ ఒప్పుకున్నాక – ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. నితిన్ న‌టించిన ‘భీష్మ‌’ ఈనెల 21న విడుద‌ల అవుతోంది. మ‌రోవైపు `రంగ్ దే` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నితిన్‌. పెళ్లి కోస‌మ‌ని.. ‘రంగ్ దే’ షూటింగ్ ప‌నులు చ‌క చ‌క పూర్తి చేస్తున్నాడు నితిన్‌. మార్చి నెలాఖ‌రుకి `రంగ్ దే` పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నాడు. ఇక పెళ్లిళ్ల జాబితాలో ముందుగా క‌నిపించే పేర్లు ప్ర‌భాస్‌, రానాల‌వి. వాళ్లెప్పుడు పెళ్లి క‌బురు చెబుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close