“రాబిన్ శర్మ” సలహాలతో చంద్రబాబు రాజకీయం..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఓ వ్యూహకర్తను నియమించుకున్నారు. ఆయన పేరు రాబిన్ శర్మ. ఆయన తన బృందంతో ఇప్పటికే రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పని కూడా ప్రారంభించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాబిన్ శర్మ గతంలో నరేంద్రమోడీ ప్రచార వ్యవహారాలను చూసుకున్నారు. ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి.. ఈ రంగంలోకి అడుగు పెట్టారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వంటి సంస్థల‌కు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. ఆయన పనితీరును కొద్ది రోజుల పాటు పరిశీలించిన తర్వాత వచ్చే నాలుగేళ్ల వరకూ వినియోగించుకోవాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోమూడు రాజధానుల ప్రకటన, కులపరమైన రాజకీయల విభజన పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న రాబిన్ శర్మ టీం… ఈ నెలాఖరుకు.. ఓ మధ్యంతర నివేదికను చంద్రబాబుకు ఇస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాటితో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..సోషల్ మీడియా ప్రచారాన్ని ఏ కోణంలో చేయాలి.. ఎలా ముందుకెళ్లాలనన్న సలహాలు కూడా రాబిన్ శర్మ ఇస్తారని అంటున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి కలిగించే ప్రధాన అంశాలపై.. ఈ రాబిన్ శర్మ టీం ప్రధానంగా దృష్టి సారిస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ వ్యూహాల్లో పండిపోయిన చంద్రబాబునాయుడు .. ఇతరుల సలహాలు తీసుకోవాలన్న ఆలోచన చేయడం అనూహ్యమేనని టీడీపీ వర్గాలంటున్నాయి. అయితే.. చంద్రబాబు ఎవరు ఏమి చెప్పినా వింటారు.. చివరకు తాను చేయాలనుకున్నదే చేస్తారని.. టీడీపీ వర్గాలు అంటూంటాయి. ఈ క్రమంలో రాబిన్ శర్మ బృందాన్ని క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలన… సోషల్ మీడియా క్యాంపైన్ ప్లాన్ చేసుకోవడానికి ఎక్కువగా వినియోగించుకుంటారని అంటున్నారు. ఈ రాబిన్ శర్మ బృందానికి నాలుగున్నరేళ్లకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు.. ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

‘కృష్ణ‌మ్మ’ రివ్యూ: కొన్ని అల‌లు… ఇంకొన్ని సుడిగుండాలు

Krishnamma Movie Review తెలుగు360 రేటింగ్: 2.75/5 కొన్ని క‌థ‌ల్ని మ‌ల‌యాళ, త‌మిళ ద‌ర్శ‌కుడు డీల్ చేసే విధానం భ‌లే బాగుంటుంది. వాస్త‌విక‌త‌కు అద్దం ప‌ట్టేలా స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఆయా క‌థ‌ల్లో జీవం ఉట్టిప‌డుతుంటుంది. సినిమాటిక్...

ద‌ర్శ‌కురాలిగా ఆర్.జే!

ఆర్జే.. (రేడియో జాకీ)ల‌కూ టాలీవుడ్ కు గట్టి అనుబంధ‌మే ఉంది. కొంత‌మంది ఆర్‌.జేలు న‌టుల‌య్యారు. ఇంకొంత‌మంది డ‌బ్బింగ్ ఆర్టిస్టులుగా మారారు. కొంద‌రు హీరోలుగానూ మారారు. ఇప్పుడు ఓ ఆర్‌.జే మెగాఫోన్ ప‌ట్ట‌బోతోంది. త‌నే.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close