వైసీపీ మద్యం, మనీపై నిఘా పెట్టడమే టీడీపీ మొదటి టాస్క్..!

ఎన్నికల్లో నగదు, మద్యం పంచకూడదని.. అలా చేస్తే అనర్హతా వేటు వేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటన…ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ విషయాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికలలో ప్రచారం , గెలుపు కంటే ముందు… వైసీపీ నేతలు పంచే మద్యం, డబ్బుల వ్యవహారాల్ని వీడియో సహితంగా పట్టుకోవాలని ఓ మిషన్ పెట్టుకుంది. దీనిపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాలు, గ్రామాల వారీగా వైసీపీ చేసే ఇలాంటి అక్రమాలను.. వీడియోలు తీసి పంపేందుకు…శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత మంత్రి అప్రమత్తంగా ఉన్నారు. ఎవరూ భయపడకుండా.. ధైర్యంగా పోరాడి వైసీపీ వాళ్ల కథ తేల్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ డబ్బు, మద్యం పంపిణీని ఫొటోలు, వీడియో తీసి .. ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ కు పంపాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపాలి, మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కి వచ్చే వీడియోలు ఫోటోలతో ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. యువనాయకత్వానికి అవకాశం ఇచ్చి వీరోచితంగా పోరాడాలని చంద్రబాబు సూచిస్తున్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు ధైర్యంగా ఎదుర్కుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో… డబ్బులు పంచకుండా.. మద్యం పంచకుండా ఉండటం సాధ్యం కాదు.

అధికార పార్టీ నేతలకు ఉండే అడ్వాంటేజ్ ఈ రెండే. అయితే ముఖ్యమంత్రి మాత్రం.. పథకాలు అమలు చేస్తూ..పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశాం కొత్తగా ఏమీ ఇవ్వొద్దని అంటున్నారు. కానీ ఓడితే.. మంత్రుల్ని బలి చేస్తానని ప్రకటించడం.. ఎమ్మెల్యేలకు సీట్లు ఉండవని హెచ్చరించడంతో వారు..ఎంతకైనా తెగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో.. టీడీపీ…తమ సంగతేమో కానీ.. వైసీపీ నేతలు డబ్బులు, మద్యం పంచకుండా చేయడమే ప్రధానంగా ఎన్నికల మిషన్‌లో భాగంగా పెట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close