ఉగాదికి ఇళ్ల పట్టాల పండగ లేదు..!

ఉగాది రోజున పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలనుకున్న ప్రభుత్వ సంకల్పం ఆగిపోయింది. ఇళ్ల స్థలాల పంపిణీని అంగీకరించబోమని.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో సెంటు చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజునే.. ఉగాది రోజున ఇళ్ల పట్టాల పంపిణీ సాధ్యం కాదని తేలిపోయింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన పనులు 29వ తేదీ వరకూ ఉన్నాయి.

ఉగాది 25వ తేదీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. ఇళ్ల పట్టాల పంపిణీ కుదరదు. కౌంటింగ్ ముగిసి.. పాలకవర్గాలు ఏర్పడిన తర్వాతే… కోడ్ ముగుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి… ఎలాగోలా పంచేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం.. నిన్నటిదాకా పాత పథకాల విషయంలో.. ఓటర్లపై ప్రభావం చూపుతాయో.. లేదో చూసి.. నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తోంది. ఇప్పుడు… ఇళ్ల స్థలాల పంపిణి వ్యక్తిగత లబ్దిగానే చూస్తున్నామని.. పట్టాల పంపిణీకి అంగీకరించబోమని ప్రకటించేసింది. దీంతో.. ఇప్పటికి కూపన్లను.. అనధికారికంగా పంపిణీ చేస్తున్నారు.

ఇలా ఇళ్ల స్థలాలు పొందిన వారందరికీ.. ఎన్నికలు ముగిసిన తర్వాత … పట్టాల పంపిణ చేస్తామని చెబుతున్నారు. నిజానికి.. పాతిక లక్షల ఇళ్ల స్థలాలను అధికారులు సిద్ధం చేయలేకపోయారు. పెద్ద ఎత్తున స్థలాల కొరత ఉండటం.. అసైన్డ్ ల్యాండ్స్ ను స్వాధీనం చేసుకునే విషయంలో కోర్టుల్లో కేసులు పడటంతో.. ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. వివాదాస్పద భూముల్ని.. లబ్దిదారులకు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పంపిణీలో ఇవన్నీ వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉండటంతో…అధికార పార్టీ కూడా వాయిదా పడితే మంచిదేనని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కోడ్ కూడా కలిసి రావడంతో.. ఇప్పుడు ప్రజలకు చెప్పుకోవడానికి ఓ కారమం దొరుకుతుందని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close