ఎన్నికల కమిషనర్‌ను పీకేసేందుకు జగన్ ప్రయత్నాలు..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కోపం వచ్చింది. ఆ కోపం అలాంటి.. ఇలాంటిది కాదని.. ఆదివారమే తేలిపోయింది. ఆయన పది నెలల్లో ఎప్పుడూ పెట్టని ప్రెస్‌మీట్‌ను.. చంద్రబాబుపై కోపంతో కాకుండా… ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ పై కోపంతో పెట్టారు. తనకు 151 సీట్లు వచ్చినా తనను సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేయడం ఏమిటనేది ఆయన ఆగ్రహం. అయితే… ప్రెస్‌మీట్‌లో విమర్శలు చేసి… కామ్‌గా ఉంటే.. ఆయన ముఖ్యమంత్రి జగన్ ఎలా అవుతారు..?. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు.. దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని స్ట్రాంగ్‌గా డిసైడయ్యారు. సోమవారం.. పలువురు న్యాయకోవిదులతో పాటు.. మాజీ సీఎస్.. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్‌ఈసీగా పని చేసిన రమాకాంతరెడ్డిని.. హుటాహుటిన పిలిపించుకున్నారు. ఆయనతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మొదటి అంశం.. ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగించడం.

దానికి తగ్గ ప్రాసెస్‌పై పూర్తి స్థాయి కసరత్తును ప్రభుత్వం చేసింది. ఎస్‌ఈసీకి రాజ్యాంగ వ్యవస్థ. తీసేయడం.. అంత తేలిక కాదు. హైకోర్టు న్యాయమూర్తికి తగ్గ అధికారాలు ఎస్‌ఈసీకి ఉంటాయి. తొలగించాలన్న దాదాపుగా అభిశంసన లాంటి పద్దతి ఉంటుంది. అసెంబ్లీలో మూడింట రెండు వందల మెజార్టీతో ఆమోదం పొందాలి. దీనికి కేంద్రం కూడా ఆమోద ముద్ర వేయాలి. ప్రస్తుతం.. అసెంబ్లీలో మూడింట రెండు వందల మెజార్టీ… ఏపీ సర్కార్ కు ఉంది. కానీ కేంద్రం సహకరిస్తుందా అన్నదే కీలకం. దీని కోసం ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఆయనను తొలగించిన తర్వాత రమాకాంతరెడ్డికే ఎస్‌ఈసీగా బాధ్యతలు ఇచ్చి… స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా సోమవారం నాటి సమావేశాల్లో వచ్చినట్లుగా… ప్రచారం జరుగుతోంది. ఎస్‌ఈసీతో సంబంధం లేకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే… స్థానిక ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఏమైనా ఉందేమోనన్న పరిశీలన కూడా నిన్నంతా జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని.. ఎస్‌ఈసీ ప్రమేయం లేకుండా ముందుకెళ్తే.. ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో రావడంతో మిన్నకుండిపోయినట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close