గ్రేడులు సిద్ధం… మంత్రివర్గ విస్తరణ తథ్యం…!!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన, కొత్త వారికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సర్వం సిద్ధం చేసుకున్నారు. మంత్రివర్గంలోని తన సహచరుల పనితీరుపై ఇంటెలిజెన్స్ విభాగం తో పాటు ప్రైవేటు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల పనితీరు ఆధారంగా ఏ, బీ,సీ,డీ గ్రేడులు నిర్ణయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ గ్రేడ్ల ఆధారంగా మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సహా మరో ఐదుగురు పదవులకు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు. నెల రోజుల క్రితం వరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై అసహనంతో ఉన్న కేసీఆర్ కరోనా వైరస్ ప్రభావ అనంతర పరిణామాలతో మంత్రి పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో బహిర్గతం కాని అసంతృప్తితో మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా రెండుమూడు సార్లు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. మంత్రివర్గం నుంచి ఈటెల రాజేంద్రకు ఉద్వాసన తప్పదని ప్రచారం కూడా జరిగింది. కరోనా వైరస్ పుణ్యమాని మంత్రి రాజేందర్ కాళ్లకు బలపం కట్టుకుని మరీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతినిత్యం ఆసుపత్రి సందర్శనతో పాటు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్న వారితో నేరుగా మాట్లాడారు. ఈ పనితీరుతో మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకున్నారని చెబుతున్నారు. ఈయనతో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా తన పనితీరుతో ముఖ్యమంత్రి నుంచి మార్కులు కొట్టేశారని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని, సంస్థను లాభాల బాటలో పట్టించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ముఖ్యమంత్రికి సంతృప్తి కలిగించాయని అంటున్నారు. మంత్రులకు ఇచ్చిన గ్రేడింగ్ లలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. కార్మిక శాఖకు సంబంధించిన అధికారులు నుంచే కాక పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి కూడా మల్లారెడ్డి పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సమాచారం. దీంతో రానున్న మంత్రివర్గ విస్తరణలో మల్లారెడ్డికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. ఈ ఉద్వాసన జాబితాలో మరో నలుగురైదుగురు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిందని నిర్ధారించుకున్న అనంతరం మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close