‘మా’ ఉందా? లేదా?

క‌రోనా వ‌ల్ల అస్త‌వ్య‌స్థ‌మైన వ్య‌వ‌స్థ‌ను త‌మ వంతుగా చెక్క‌దిద్దేందుకు, పేద వాళ్ల‌కు స‌హాయం చేసేందుకు, ప్ర‌భుత్వానికి ఉడ‌తాభ‌క్తి స‌హాయం అందించేందుకు హీరోలు క‌దిలివ‌స్తున్నారు. విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. సినీ కార్మికుల క‌న్నీళ్లు తుడ‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ.. ఈ విష‌యంలో ముందుండాల్సిన `మా` మాత్రం ఉందో, లేదో అర్థం కావ‌డం లేదు. పేద క‌ళాకారుల‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన బాధ్య‌త ‘మా’పై ఉంది. వ్య‌క్తిగ‌తంగా ఒక‌రో, ఇద్ద‌రో ముందుకొచ్చి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే, ఓ వ్య‌వ‌స్థ‌గా ఉండి, `మా` ఏమీ చేయ‌లేక‌పోతోంది

అధ్య‌క్షుడు న‌రేష్ సెల‌వుల్లో ఉంటే, ఆ స్థానంలోకి వ‌చ్చిన బెన‌ర్జీ మాత్రం సందేశాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. క‌రోనా రాకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో వీడియోల రూపంలో చెబుతూ వ‌స్తున్నారు త‌ప్పితే… `మా` త‌న వంతుగా ఏం చేయ‌బోతోందో? రెక్కాడితే గానీ డొక్కాడని పేద న‌టీన‌టుల కోసం ఏం చేయాల‌నుకుంటుందో చెప్ప‌లేదు. అలాగ‌ని `మా` ద‌గ్గ‌ర నిధులు లేవా? అంటే ఉన్నాయి. కానీ వాటిని ఎలా వాడాలో, ఎవ‌రి కోసం వాడాలో తెలియ‌డం లేదంతే. `మా` అనే కాదు, ఛాంబ‌ర్ ప‌రిస్థితి కూడా ఇంతే. ఛాంబ‌ర్ సైతం త‌న వంతుగా క‌దిలి రావాల్సిన బాధ్య‌త ఉంది. లైట్ బోయ్స్ ద‌గ్గ‌ర నుంచి జూనియ‌ర్ ఆర్టిస్టుల వ‌ర‌కూ అంతా ఈ లాక్ డౌన్‌లో ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్నారు. వీటిలో చాలామంది తిన‌డానికి తిండి లేక ఇబ్బంది ప‌డుతున్నారు. వీరంద‌రికోసం `మా`, నిర్మాత మండ‌లి క‌లిసి క‌ట్టుగా ఏదైనా చేస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close