11 మందికి నెగెటివ్..! కరోనాపై తెలంగాణ పైచేయి..!

తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు తగ్గబోతున్నాయి. ఇప్పటికి కరోనా పాజిటివ్ వచ్చి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పదకొండు మందికి నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇది ఓ మంచి సంకేతమన్నారు. మొత్తంగా తెలంగాణలో 67 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. రెండు, మూడు రోజుల నుంచి రోజుకు పది చొప్పున పాజిటివ్ కేసులు తేలినా.. ఆదివారం ఆ స్థాయిలో వెలుగులోకి రాలేదు. అదే సమయంలో.. పదకొండు మందికి నెగెటివ్ రావడం.. గొప్ప ముందడుగుగా భావిస్తున్నారు. మూడు రోజుల పాటు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

దేశంలో అనేక ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స జరుగుతోంది కానీ.. ఒక్క సారే పదకొండు మందికి పాజిటివ్ రాలేదు. తెలంగాణలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు వ్యక్తికి కూడా తెలంగాణ వైద్యులు నయం చేశారు. అతను కూడా డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు.. పాజిటివ్ తేలిన వారందరికీ.. పటిష్టమైన వైద్య సదుపాయులు కల్పిస్తూండటం.. వైద్యులు ఎప్పటికప్పుడు … రోగుల ఆరోగ్య పరిస్థితిని చూసి.. తగిన వైద్య సదుపాయాలు కల్పిస్తూండటంతో.. నెగెటివ్ రిపోర్టులు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

పాజిటివ్ రిపోర్టుల ఉన్న మిగతా.. 66 మంది ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. ఎవరికీ సీరియస్ గా లేదని.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కరికి మాత్రమే.. వెంటిలేటర్ సపోర్టు ఇచ్చారు. మిగతా వారని పూర్తిగా ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతే.. తెలంగాణలో చేపట్టిన లాక్ డౌన్ సక్సెస్ అయినట్లే అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వం.. కల్పించిన వైద్య సౌకర్యాలు కూడా.. మంచి ఫలితాన్నిచ్చినట్లు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close