లాక్ డౌన్‌: మందుబాబుల బాధ‌లు చూడ‌త‌ర‌మా?

లాక్ డౌన్ వ‌ల్ల దేశం మొత్తం స్థంభించిపోయింది. ఎక్క‌డి ప‌నులు అక్క‌డ ఆగిపోయాయి. సినిమాలు, షాపింగ్ మాళ్లూ బంద్ అయ్యాయి. నిత్యావ‌స‌ర వ‌స్తువులు దొరుకుతున్నాయి గానీ, ఆల్క‌హాల్ మాత్రం దూర‌మైంది. దీంతో చుక్క‌లేనిదే పొద్దుపోని మందుబాబులు అష్ట‌క‌ష్టాలూ ప‌డుతున్నారు. డ్రై డే రోజున కూడా బ్లాకులో మ‌ద్యం కొనుగోలు చేసి, దాహార్తిని తీర్చుకునే మందుబాబులు ఇప్పుడు చుక్క దొర‌క్క అల్లాడిపోతున్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా? మ‌ళ్లీ వైన్ షాపుల ముందు ఎప్పుడు క్యూ క‌డ‌తామా? అంటూ రోజులు లెక్క‌బెడుతున్నారు. కొంత‌మంది ప‌రిస్థితి అతి దారుణంగా ఉంది. నిత్యావ‌స‌ర వ‌స్తువులులానే ఇక నుంచి మ‌ద్యం కూడా స‌ర‌ఫ‌రా చేస్తార‌ని, రోజుకి రెండు గంట‌లు పాటు వైన్ షాపులు తెర‌చి ఉంచుతార‌ని ఓ పుకారు వ్యాపించ‌డంతో, అది నిజ‌మే అనుకుని వైన్ షాపులు చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తున్నారు. ఓ ప్ర‌బుద్ధుడు కాస్త ముందు అడుగేసి, మ‌ద్యం ఇంటికే స‌ర‌ఫ‌రా చేసేలా ఓ చ‌ట్టం రూపొందించాల‌ని కోర్టు కెక్కాడు. స‌ద‌రు పిటీష‌ను దారుడికి నాలుగు అక్షింత‌లు వేసిన కోర్టు, ఇలాంటి చెత్త పిటీష‌న్ దాఖ‌లు చేసినందుకు గానూ 50 వేల రూపాయ‌ల జ‌రిమానా కూడా విధించింది.

ఇప్పుడు మందు దొర‌క్క‌, నాలుక పీక్కుపోయి, మ‌తిస్థిమితం చెడిపోతున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కార‌ణంతోనే ఆదివారం ఎర్ర‌గ‌డ్డ ఆసుప‌త్రిలో 50 కేసులు న‌మోద‌య్యాయి. సోమ‌వారం మ‌రో వంద మంది పేషెంట్లు ట్రీట్‌మెంట్ కోసం వైద్యుల్ని సంప్ర‌దించారు. మ‌ద్యం వ్య‌స‌ర‌మైపోవ‌డం వ‌ల్ల‌, స‌కాలంలో మ‌ద్యం దొర‌క్క‌పోవ‌డంతో మ‌తిస్థిమితం త‌ప్పుతుంద‌ని, పిచ్చిప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తార‌ని, ఈ త‌ర‌హా కేసులు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయ‌ని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో ఒక్క హైద‌రాబాద్‌లోనే ఇలాంటి కేసులు 200 వ‌ర‌కూ వెలుగు చూశాయంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. శానిటైజ‌ర్ల‌లో ఆల్క‌హాల్ ఉంద‌న్న ప్ర‌చారం మొద‌ల‌వ్వ‌డంతో కొంత‌మంది ప్ర‌త్యామ్నాయంగా శానిటైజ‌ర్లు సేవిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఊర్ల‌లో ప‌రిస్థితి వేరు. అక్క‌డ మ‌ద్యం దొర‌క్క‌పోయినా క‌ళ్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వాటి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ఇది వ‌ర‌కు రెండు లీట‌ర్ల బాటిల్ రూ.100కి అమ్మేవారు. ఇప్పుడు 500 ఇచ్చి క‌ళ్లు కొన‌డానికి సైతం జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close