మే 3 వరకు లాక్‌డౌన్‌..! ప్రత్యేకంగా 19 రోజులే పొడిగింపు ఎందుకు..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మరో పందొమ్మిది రోజులు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే మే మూడో తేదీ వరకూ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున.. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని కేంద్రం భావించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తొలగించడం కరెక్ట్ కాదని మోడీ వ్యాఖ్యానించారు. ఈ 20 వరకు కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తారు. ఆ తర్వాత అత్యవసర సేవలకు అనుమతులు ఇస్తామన్నారు. హాట్‌స్పాట్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.

లాక్‌డౌన్‌పై ప్రత్యేకమైన నివేదికను, విధివిధానాలను బుధవారం ప్రకటిస్తామని మోడీ తెలిపారు. రోజు కూలీలు, పంటల కోతల కారణంగా రైతుల సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. ఏమైనా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చి ఉంటే.. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన చోట అన్ని సడలింపులు రద్దు చేస్తామని మోడీ తెలిపారు. వచ్చే మూడునాలుగు వారాలు అత్యంత కీలకం అన్నారు. మే మూడో తేదీ వరకు ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాయని.. అన్నీ ఆలోచించిన తర్వాతే మే మూడో తేదీ వరకు.. పొడిగించామని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ సందర్భంగా పాటించాలంటూ.. ప్రజలకు మోడీ ఏడు సూచనలు చేశారు. ఇళ్లలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఆరోగ్యసమస్యలున్నవారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్, సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలని… ఇంట్లో చేసుకున్న మాస్కులనైనా తప్పనిసరిగా వాడాలని పిలుపునిచ్చారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చే సూచనలను పాటిస్తూ.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. ఆరోగ్య సేతు అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోలని కూడా.. మరో అంశంగా సూచించారు. వీలైనంత వరకు పేద కుటుంబాలకు సాయం చేయాలన్నారు. కరోనాపై పోరాడుతున్న యోధులు డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. .

ప్రత్యేకంగా 19 రోజుల లాక్ డౌన్ పొడిగింపును ప్రధాని ఎందుకు ప్రకటించారనేది చాలా మందికి ఆసక్తి కలిగిస్తున్న సందేహం. అయితే.. రెండు వారాలు లేకపోతే.. నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రత్యేకంగా 19 రోజులు.. లెక్క పెట్టి మరీ పొడించారు. మే మూడో తేదీ వరకూ ఈ పొడిగింపు ఉంది. ఇప్పటి వరకూ మూడు వారాల లాక్ డౌన్ వల్ల 21 రోజులు అయింది. ఆ తర్వాత పందొమ్మిది రోజులు కలిపితే నలభై రోజులు అవుతుంది. ఈ సమయం కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆపడానికి పోతుందన్న సైంటిఫిక్ అంచనాలు ఉండబట్టే.. ఇలా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close