ట‌బుకి రీప్లేస్ మెంట్‌ క‌ష్ట‌మే!

రీమేక్ వెనుక చాలా క‌ష్టాలుంటాయి. క‌థైతే ఆలోచించాల్సిన ప‌నిలేదు గానీ, క‌నిపించ‌ని స‌మ‌స్య‌లు చాలానే వెంటాడుతుంటాయి. ముఖ్యంగా మ‌న నేటివిటీకి స‌రిప‌డిందా, లేదా? అనే విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. దానికి తోడు… పాత్ర‌ధారుల్ని ఎంపిక చేయ‌డం మ‌రో పెద్ద క‌ష్టం. కొన్ని సినిమాల‌కు కొన్ని పాత్ర‌లు జీవం పోస్తాయి. అలాంటి న‌టుల్ని రీప్లేస్ చేయ‌డం ఎల్ల‌వేళ‌లా సాధ్యం కాదు. `అంధధూన్‌` రీమేక్ కి ఇలాంటి క‌ష్ట‌మే ఎదుర‌వుతోంది.

ఆయుష్మాన్ ఖురానా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ హిందీ చిత్రం.. అక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యింది. హీరోకి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ పుర‌స్కారం కూడా ల‌భించింది. ఈ సినిమాని ఇప్పుడు నితిన్ రీమేక్ చేస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానాని నితిన్ భ‌ర్తీ చేయ‌గ‌ల‌డు. కానీ స‌మ‌స్య.. ట‌బు పాత్ర‌తోనే. ఇందులో ట‌బు ఓ కీల‌క‌మైన పాత్ర పోషించింది. ఓ ర‌కంగా త‌నే ఈ సినిమా విల‌న్‌. ట‌బు లాంటి న‌టి, నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర పోషించ‌డం వ‌ల్ల ఈ సినిమాకి అద‌న‌పు హంగు ఏర్ప‌డింది. ఇప్పుడు తెలుగులో ఆ పాత్ర‌ని చేసే క‌థానాయిక‌ని వెదికిప‌ట్టుకునే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. అయితే ట‌బుని రీప్లేస్ చేసే హీరోయిన్ దొర‌కడం లేదు. జ్యోతిక పేరు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చినా, తాను ఈ పాత్ర ఒప్పుకోదు. ఓ మాజీ హీరోయిన్‌, పైగా సెక్స‌పీల్ ఉన్న క‌థానాయిక అయితే బాగుంటుంది. కేథ‌రిన్‌, అమ‌లాపాల్ లాంటి వాళ్ల‌ని ఆ పాత్ర కోసం ప‌రిశీలిస్తున్నారు. ఎవ‌ర్ని తీసుకున్నా.. ట‌బు తో పోల్చి చూస్తే దొరికిపోతారు. పోనీ ట‌బునే తీసుకుంటే పోలా..? ఆమె ఒప్పుకుంటే ఈ క‌ష్టం నుంచి గ‌ట్టెక్కిన‌ట్టే. కాక‌పోతే ఆమె పారితోషికమే భ‌రించ‌డం క‌ష్టం. పైగా ఓసారి చేసిన పాత్ర‌ని మ‌రోసారి చేయ‌డానికి ట‌బు ఇష్ట ప‌డుదు కూడా. సో.. ప్ర‌త్యామ్నాయం వెదుక్కోవ‌డం త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2026 నియోజకవర్గాల పునర్విభజన: పులివెందుల ఎస్సీ నియోజకవర్గంగా మారనుందా?

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కుదేలయిన సంగతి తెలిసిందే. 2026 నియోజకవర్గాల పునర్విభజన లో వైఎస్ఆర్‌సీపీ...

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close