ఫ్లాష్ బ్యాక్‌: న‌రేష్‌ని హీరోని చేసిన అమితాబ్‌

అల్ల‌రి న‌రేష్ హీరో అవ్వ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా? సాక్ష్యాత్తూ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌. ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో అల్ల‌రి న‌రేష్ స్వ‌యంగా చెప్పాడు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే..

న‌రేష్‌ని డైరెక్ట‌ర్‌ని చేయాల‌ని ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ఆశ‌. ఆర్య‌న్ రాజేష్‌ని హీరోగా చూడాల‌నుకున్నారు. ఈవీవీ సినిమాల‌కు దాదాపు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడు న‌రేష్‌. ఆ స‌మ‌యంలో క్లాప్ బోర్డు ప‌ట్టుకుని సెట్టంతా తెగ తిరిగేసేవాడు. కానీ.. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేష్‌, బ్ర‌హ్మానందం లాంటి క‌మెడియ‌న్ల‌ని చూడ‌గానే న‌టుడ‌వ్వాల‌న్న కోరిక పుట్టింది న‌రేష్ లో. సెట్లో హీరోలు, క‌మెడియ‌న్లు చెప్పే డైలాగుల్ని ఇంటికొచ్చి మ‌రీ ప్రాక్టీసు చేసేవాడు. కానీ తండ్రికి చెప్పాలంటే భ‌యం. `నువ్వు డైరెక్ట‌ర్‌. అన్న‌య్య హీరో..` అంటూ నాన్న చిన్న‌ప్పుడే చెప్పేయ‌డంతో.. త‌న మ‌న‌సులోకి కోరిక ఎప్పుడూ తండ్రి ముందు బ‌య‌ట‌పెట్ట‌లేదు. `చాలా బాగుంది` సినిమా వంద రోజుల ఫంక్ష‌న్‌కి బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో హిందీలో అమితాబ్ తో `సూర్య‌వంశ్‌` సినిమా తీస్తున్నాడు ఈవీవీ. `చాలా బాగుంది`కి న‌రేష్ క్యాషియ‌ర్‌. వేదిక‌పై క్యాషియ‌ర్ హోదాలో అమితాబ్ నుంచి షీల్డు అందుకునే స‌మ‌యంలో… `న‌రేష్‌.. ఈవీవీ గారి అబ్బాయి` అని బిగ్ బీకి న‌రేష్‌కి ప‌రిచ‌యం చేశారెవ‌రో. దాంతో.. `మా అబ్బాయిలా పొడుగ్గా ఉన్నాడు… హీరోగా ప‌నికొస్తాడు` అంటూ ఈవీవీతో అన్నార‌ట బిగ్ బీ.

దాంతో… న‌రేష్ లో ఉత్సాహం వ‌చ్చేసింది. `స్వ‌యంగా అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటివారే చెప్పారు. న‌న్ను హీరోగా చేయ‌మ‌ని. ఇక నీకున్న అభ్యంత‌రం ఏమిటి` అంటూ నాన్న‌ని అడిగే ధైర్యం వ‌చ్చేసింది న‌రేష్‌కి. అటు బిగ్ బీ అలా చెప్ప‌డం, ఇటు న‌రేష్ కూడా `హీరో..` అంటూ క‌ల‌వరించ‌డంతో, న‌రేష్ ని యాక్టింగ్ స్కూల్‌లో చేర్పించారు ఈవీవీ. అలా న‌రేష్ హీరో అవ్వ‌డం వెనుక బిగ్ బీ హ‌స్తం కూడా క‌లిసిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close