మధ్యతరగతి కష్టాల్ని ఇట్టే తీర్చిన కేసీఆర్..!

లాక్ డౌన్ పొడిగిస్తే.. తమ పరిస్థితి ఏమిటి అని మథన పడుతున్న మధ్యతరగతి వర్గానికి కేసీఆర్ కష్టాలు తీర్చారు. ఎక్కడైనా మధ్యతరగతి జీవులకు ప్రధాన భారం ఇంటి అద్దె. తమ జీతంలో కనీసం 30 శాతం ఇంటి అద్దెకు కట్టే మధ్యతరగతి జీవులు హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. దాదాపు అన్ని పట్టణాల్లోనూ ఉంటారు. లాక్ డౌన్ కారణంగా వీరిలో చాలా మందికి జీతాలు రాని పరిస్థితి. ఇంటి అద్దె దగ్గర్నుంచి… ప్రతీ అవసరానికి అమ్మో ..ఒకటో తారీఖు అనుకునే పరిస్థితి ఉంటుంది. కేసీఆర్.. వారి బాధల్ని అర్థం చేసుకున్నారు. ఇంటి అద్దె వసూలను మూడు నెలల పాటు వాయిదా వేస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా యజమానాలు వేధిస్తే.. 100కు డయల్ చేయాలని కిరాయిదార్లను ఆఫర్ కూడా ఇచ్చారు. సతాయిస్తే ఇంటి యజమానులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

మధ్యతరగతి తల్లిదండ్రుల మరో వర్రీ పిల్లల స్కూల్ ఫీజులు . దీనిపై కేసీఆర్ కొంత రిలీఫ్ ఇచ్చారు. 2020-21 సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్స్‌ ఫీజులు పెంచొద్దని స్పష్టం చేశారు. రకరకాల ఫీజు వసూలు చేయొద్దు..కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని.. నెలవారీగా మాత్రమే ట్యూషన్‌ ఫీజు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్‌ స్కూళ్లు ఇబ్బంది పెట్టొద్దని.. ప్రభుత్వం చెప్పినట్టు వినకుంటే ప్రైవేట్‌ స్కూళ్ల పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ రెండింటితో.. మధ్యతరగతి కుటుంబాలకు.. తాత్కాలికంగా అయినా చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది.

అయితే ఉద్యోగులకు ఈ నెల కూడా పూర్తి జీతం ఇచ్చేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత నెల మాదిరిగానే వేతనాలు ఇస్తామని.. పెన్షనర్లకు 75 శాతం జీతం ఇస్తామని ప్రకటించారు. వైద్య సిబ్బంది, మున్సిపల్‌, గ్రామపంచాయతీ పారిశుద్ధ్యకార్మికులకు ఏప్రిల్‌ మాసంలోనూ ప్రోత్సాహకం ఇస్తామని.. పోలీస్‌ సిబ్బందికి గ్రాస్ సాలరీ కింద 10 శాతం సీఎం గిఫ్ట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. గత నెలలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ సీఎం గిఫ్ట్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close