దిశ ఘటన మిగిల్చిన ఆవేదన కారణంగానే సోషల్ మీడియా లోకి: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏదో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి ఎప్పుడో ఒకసారి ట్వీట్ చేసి ఊరికే ఉండడం కాకుండా, తరచుగా స్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చుక్క ఉంటున్నారు . అయితే ఇంత కాలం తర్వాత, చాలా ఆలస్యంగా సోషల్ ఇండియా లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటో తెలియజేశారు చిరంజీవి. దిశ ఘటన అప్పుడే సోషల్ మీడియాలోకి రావాలని అనుకున్నట్లు వివరించారు. వివరాల్లోకి వెళితే..

ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. కరోనా విపత్తు సమయంలో సినీ కార్మికులకు అండగా ఉండటానికి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి, సినీ కార్మికులకు అండగా నిలబడుతున్నారు. తను ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తన తోటి కళాకారులు సినీ పెద్దలు కూడా సహాయం చేసేలా ప్రోత్సహించి ఆ డబ్బుని నేరుగా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నేరుగా అందిస్తున్నారు. ఈ విషయాలను చర్చించడానికి టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో కి రావడానికి ఎందుకింత ఆలస్యం చేశారు అన్న ప్రశ్న చిరంజీవికి ఎదురైంది.

చిరంజీవి దానికి సమాధానమిస్తూ, దిశ ఘటన సమయంలో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని, ఆ సమయంలో తన ఆవేదనను పంచుకోవడానికి సోషల్ మీడియా లో అకౌంట్ ఉంటే బాగుండేదని అనిపించింది అని చెప్పుకొచ్చారు. ప్రెస్ నోట్ విడుదల చేసి ఉంటే అది ప్రజలకి చేరి ఉండేదేమో కానీ ఒక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన భావాలను నేరుగా తెలియజేస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అనిపించిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. అదే విధంగా జనవరి ఫిబ్రవరి ఈ సమయంలో కరోనా ముప్పు ముంచుకొస్తున్న సమయంలో ప్రజలకు తగిన సూచనలు ఇవ్వడానికి, ప్రజలతో తన భావాలను పంచుకోవడానికి సోషల్ మీడియా లో కి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు చిరంజీవి చెప్పారు.

ఏదిఏమైనా చిరంజీవి సోషల్ మీడియాలో కి రావడం ఆయన అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. అదే విధంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు చిరంజీవి అండగా ఉంటూ తెలుగు పరిశ్రమకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్లు గా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close