అమృతారామ‌మ్‌… ఇప్ప‌టిది కాదు ఈ బేర‌మ్‌!

విడుద‌ల కాని చిన్న‌, మీడియం సైజు సినిమాల‌కు ఓటీటీ సంస్థ‌లు గాలాలు వేస్తున్న రోజులివి. `థియేట‌ర్ల కోసం ఎదురు చూడ‌కుండా ఓటీటీలోనే మీ సినిమాల్ని విడుద‌ల చేసుకోవ‌డం మంచింది` అంటూ స‌ల‌హాలు వినిపిస్తున్న సంద‌ర్భం ఇది. కొంత‌కాలం ఎదురు చూద్దామా? లేదంటే ఓటీటీలో సినిమాని విడుద‌ల చేసుకుందామా? అని నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. ఈలోగా.. ఓ సినిమా ఓటీటీలో ఆడ‌డానికి రెడీ అయ్యింది. అదే `అమృతారామ‌మ్‌`. ఈనెలాఖ‌రున జీ 5 లో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఓటీటీలో నేరుగా విడుద‌ల అవుతున్న తొలి సినిమా ఇదే అంటూ ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

నిజానికి… ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా కాదు. థియేట‌ర్ కోస‌మే తీశారు. ఓటీటీ లో ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి జీ 5కి ఈ సినిమాని అమ్మేశారు. థియేట‌ర్లో విడుద‌లైన 30 రోజుల త‌ర‌వాత ఈ సినిమాని ప్ర‌ద‌ర్శించుకునేందుకు అన్ని హ‌క్కులూ క‌ల్పిస్తూ ఒప్పందం కుదిరింది. అయితే… ఇందులోనే మ‌రో ష‌ర‌తు కూడా జోడించారు. ఒక‌వేళ సినిమా ఎలాంటి కార‌ణాల‌తోనైనా విడుద‌ల కాని ప‌క్షంలో 100 రోజుల త‌ర‌వాత ఓటీటీలో ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి వీలుగా ఒప్పందం కుదిరింద‌ట‌. 100 రోజుల్లోపు సినిమా ఎందుకు విడుద‌ల కాదు? అనుకున్నారేమో దర్శ‌క నిర్మాత‌లు ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. కానీ స‌డ‌న్‌గా.. లాక్ డౌన్ వ‌చ్చి ప‌డింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఒప్పందం ప్ర‌కారం జీ 5లో విడుద‌ల‌కు ముందే ప్లే అయిపోతోంది. ఈ సినిమాకి 2.5 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. ఓటీటీ ద్వారా నిర్మాత‌ల‌కు 60 ల‌క్ష‌ల‌కు మించి రాలేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close