40 వేలు … దేశంలో కంట్రోల్ కాని వైరస్ ..!

మొన్నటి వరకూ.. పదిహేను వందలకు అటూ ఇటుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యేవి ఇప్పుడు.. రెండు వేలకు చేరుకున్నాయి. మెల్లగా 2500 దిశగా వెళ్తున్నాయి. ఏ రోజు కూడా.. కేసులు తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏ రోజుకారోజు .. కొత్త రికార్డు నమోదవుతోంది. ఆదివారం ఒక్క రోజే.. దేశంలో 2,487 కొత్త కేసులు నమోదయ్యాయి. గతంలో ఇన్ని కేసులు ఒకే రోజు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య40వేలు దాటిపోయింది. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే 83 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇది కూడా ఒకే రోజులో రికార్డు.

నిజానికి నలభై రోజుల లాక్ డౌన్ తర్వాత పరిస్థితి అదుపులోకి రావాల్సి ఉంటుంది. వైరస్ వ్యాప్తి కాలం 14 రోజులు.. కాదంటే.. 28 రోజులు. ఈ లెక్క ప్రకారం.. చూస్తే.. వైరస్ పూర్తిగా కంట్రోల్ కావాల్సి ఉంది. కానీ 40 రోజులు గడిచినా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇతర చోట్ల కాస్త నిలకడగానే పరిస్థితి ఉంది. పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదని కేంద్రం కొన్ని లెక్కలు చెబుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు పదివేల నుంచి 20 వేలకు చేరడానికి 9 రోజులు పడితే .. 20 వేల నుంచి 40 వేలకు చేరడానికి 11 రోజులు పట్టిందని..ఆశావహ దృక్పధాన్ని చెబుతోంది.కానీ కాస్త విశ్లేషిస్తే.. 11 రోజుల్లోనే 20వేలకేసులు నమోదయ్యాయని అర్థం చేసుకోవచ్చు.

దేశంలో కరోనాను అత్యంత సమర్థగా డీల్ చేసిన రాష్ట్రాల్లో కేరళ అగ్ర స్థానంలో నిలిచింది. మొదట్లో.. కరోనా పాజిటివ్ కేసుల్లో మొదట్లో ఉండే ఆ రాష్ట్రం తర్వాత పూర్తిగా కంట్రోల్ చేసింది.ఇప్పటికి కరెక్ట్‌గా 500 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారిలో నాలుగు వందల మందికి తగ్గిపోయింది. డిశార్జ్ అయ్యారు. నాలుగు మరణాలు సంభవించాయి. ప్రస్తుతానికి అక్కడ యాక్టివ్ కేసులు 96 మాత్రమే. గోవా, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లు వైరస్‌ రహిత రాష్ట్రాలుగా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close