టీవీ5 కార్యాలయంపై రాళ్లదాడి..!

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న టీవీ5 ప్రధాన కార్యాలయంపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. సెక్యూరిటీ రూమ్ అద్దాలను ధ్వంసం చేసి.. పారిపోయారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించన తర్వాత కుట్రపూరితంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిందని నిర్ధారణకు వచ్చిన టీవీ5 యాజమాన్యం.. దాడి విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేయడం ప్రారంభించింది.

న్యూస్ చానల్స్‌లో ఇటీవలి కాలంలో టీవీ5 ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రసారం చేయడంలో దూకుడుగా ఉంది. గతంలో ఏబీఎన్ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు వేయడంలో ముందు ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఆ స్థానాన్ని టీవీ5 ఆక్రమిస్తోంది. కేసులు, బెదిరింపులను కూడా తట్టుకుని దూకుడుగా వెళ్తోంది. ఈ కారణంగానే వైసీపీ.. టీవీ5ను బహిష్కరించింది కూడా. అయినప్పటికీ.. టీవీ5 వెనక్కి తగ్గడం లేదు. ఆ చానల్‌లో చర్చా కార్యక్రమాలు నిర్వహించే మూర్తిని కూడా కొద్ది రోజల కిందట… టార్గెట్ చేశారని చెప్పుకున్నారు. అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను పంపారని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వంపై దూకుడుగా వ్యతిరేక కథనాలు ఇస్తున్న సమయంలో.. వైసీపీ నేతల నుంచి.. అదే పనిగా హెచ్చరికలు వస్తున్న తరుణంలో ఇలాంటి దాడి జరగడంతో సహజంగానే ఇది వైసీపీ నేతల పనేనన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేతలు.. తక్షణంమ ఈ దాడిని ఖండించి.. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అనేక రకాలుగా చేసిన ఒత్తిళ్లు ఫలించకపోవడంతోనే దాడులకు తెగబడుతున్నారని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరు దాడి చేశారు.. కారణం ఏమిటనేది.. పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close