ఖాళీగా ఉండి కరెంట్ వాడుకోవడం వల్లే ఎక్కువ బిల్లులట..!

లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నారు. వారు విపరీతంగా కరెంట్ వాడుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లులు వచ్చాయిని… ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. రాష్ట్రం మొత్తం కరెంట్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని ప్రజలు గగ్గోలు పెడుతూంటే.. వారికి వివరణ ఇవ్వడానికి ఏపీ సర్కార్ కు తలకు మించిన భారం అవుతోంది. విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తూండటంతో ఎలా సర్ది చెప్పాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది. రోజుకో మంత్రి వివరణ ఇస్తున్నా…ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీంతో ఈ సారి బాధ్యతను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు. ఆయన కొన్ని విద్యుత్ బిల్లులను తీసుకుని మీడియా ముందుకు వచ్చారు.

అందులో బిల్లులకు ఎలా చార్జ్ చేశారో వివరించారు. తాము ఐదు వందల యూనిట్లు దాటిన వారికి మాత్రమే.. యూనిట్‌కు 90పైసలు పెంచామని..మిగతా ఏ కేటగిరీకి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. మరి ఎందుకు బిల్లులు ఎక్కువగా వచ్చాయన్నదానిపై ఆయన ఒక్కటే వాదన వినిపించారు.లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉన్నారని.. అందుకే కరెంట్ వినియోగం పెరిగిందని చెబుతున్నారు. ఎంత మంది ఇళ్లలో ఉన్నా మధ్యతరగతి ప్రజలు వాడేది మహా అయితే రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు… ఓ టీవీ. అంత దానికి నెలకు ఐదు వందల యూనిట్లు దాటిపోయేంత బిల్లురాదు.

కానీ ఎక్కువ మందికి ఐదు వందల యూనిట్లు దాటిపోయి.. బిల్లులు అత్యధికంగా వచ్చాయి. ఇలాంటి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ.. విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజలకు ఏదో ఓ భరోసా ఇవ్వాల్సి ఉంది. లేకపోతే.. ప్రభుత్వానికే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close