పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకోవాలన్న కేంద్రమంత్రి..!

పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ .. ఇక ముందుకు వెళ్లకుండా చూడాలని కృష్ణాబోర్డును కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఏపీ ఇచ్చిన పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు షెకావత్ వెంటనే స్పందించారు. బండి సంజయ్‌కు ప్రత్యుత్తరం పంపారు. తాను ఈ అంశాన్ని పరిశిలిస్తున్నాని… చెప్పారు. తక్షణం పరిస్థితుల్ని పరిశీలించడానికి అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేయాలని… కేఆర్ఎంబీకి చెప్పినట్లుగా… బండి సంజయ్‌కు పంపిన లేఖలో షెకావత్ పేర్కొన్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఇచ్చిన ఫిర్యాదుపై వేగంగా స్పందించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జీవోపై వివరణ ఇవ్వాలంటూ.. ఏపీ సర్కార్ కు నోటీసులు పంపించారు. కృష్ణా బోర్డు ఈ విషయంలో… కాస్త గట్టిగా ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతోంది. మరో వైపు కేంద్రమంత్రి కూడా.. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కృష్ణాబోర్డుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలన్నదానిపై ఏపీ అధికారులు కసరత్తు చేస్తూండగానే…. కేంద్ర జలవనరుల మంత్రినే… నేరుగా సంగమేశ్వరం ప్రాజెక్టుపై… ఏపీ సర్కార్ ముందుకెళ్లకుండా చూడాలని సూచించడం… కలకలం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. ఈ విషయంలో పట్టుదలగా ఉంది. రాయలసీమకు నీళ్లివ్వాలన్న లక్ష్యంతో చేపడుతున్న సంగమేశ్వం ప్రాజెక్టుకు… నేడో రేపో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. తమకు కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని చెబుతన్నారు. అయితే.. అనూహ్యంగా కేఆర్ఎంబీ నుంచి.. కేంద్రం నుంచి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉండటంతో… ఏపీ సర్కార్ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వెనకడుగు వేస్తే.. రాయలసీమ ప్రయోజనాలపై రాజీ పడినట్లు అవుతుంది. ముందుకెళ్తే… న్యాయవివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరించి.. ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close