కృత్రిమ గ‌ర్భంపై ర‌ష్మి ఘాటైన వ్యాఖ్య‌లు

టెక్నాల‌జీ పెరిగింది. సౌల‌భ్యాల‌కు మ‌నిషి శ‌రీరం పూర్తిగా అల‌వాటు ప‌డిపోయింది. ఆఖ‌రికి మాతృత్వం కూడా. స‌రోగ‌సీ లాంటి విధానాలు ఇప్పుడు సర్వ‌సాధార‌ణం. అయితే ఈ ప‌ద్ధ‌తి ప‌ట్ల‌.. ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది యాంక‌ర్‌, న‌టి ర‌ష్మి. జ‌నాభా పెరుగుత‌ల‌పై, స‌రోగ‌సీ విధానంపై ర‌ష్మి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసింది. దేశంలోని స‌మ‌స్య‌ల‌న్నింటికీ అధిక జ‌నాభానే కార‌ణం అని, ప‌శువుల‌కు అయినా సంతానోత్ప‌త్తికి ఓ సీజ‌న్ ఉంటుంద‌ని, మ‌నుషుల‌కు అలాంటివేం ఉండ‌వ‌ని, ఎప్పుడు ప‌డితే అప్పుడు పిల్ల‌ల్ని క‌నేస్తార‌ని వ్యంగ్య‌బాణాలు విసిరింది. ద‌త్త‌త తీసుకోవ‌డానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని, సెల‌బ్రెటీలు కూడా స‌రోగ‌సీ విధానంపై ఆస‌క్తి చూపిస్తున్నారు గానీ, ద‌త్త‌త‌కు ముందు రావ‌డం లేద‌ని, స‌రోగ‌సీ విధానంపై పిల్ల‌లు క‌న‌డం కూడా ఓ ర‌క‌మైన వివ‌క్ష చూపించ‌డ‌మే అంటోంది. ఇది కూడా ఓ ర‌కంగా కులాభిమానం, మ‌తాభిమానం లాంటిదే అని, జీన్స్ అనేది పిల్ల‌ల విష‌యంలో కొంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని, మిగిలిన‌దంతా పెంప‌కంలో ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, అది తెలిసి కూడా స‌రోగ‌సీ వెంట ప‌డుతున్నార‌ని మండి ప‌డుతోంది. ర‌ష్మి ఎప్పుడూ ఇలాంటి సీరియ‌స్ విష‌యాల‌పై, ఇంత సీరియ‌స్‌గా మాట్లాడింది లేదు. మొత్తానికి ర‌ష్మిలో కూడా సామాజిక బాధ్య‌త వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోనియాకే సన్మానం – కేసీఆర్‌కు లేదు !

తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఈసీ కూడా అనుమతి ఇచ్చింది. తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ నేతలు అభివర్ణించే...

పుణె స్టోరీ సైడ్ A : ధనవంతుల డ్రైవర్లే బలిపశువులు

ఓ ధనవంతుడి బిడ్డ తప్పతాగి డ్రైవింగ్ చేసి ఓ చిన్నారి ప్రాణం తీస్తాడు. పోలీస్ కేసవుతుంది. తన బిడ్డ ఎక్కడ జైలుకుపోతాడోనని ఆ రిచ్ కిడ్ తల్లిదండ్రులు .. డ్రైవింగ్ చేసింది...

జూ.ఎన్టీఆర్‌పై చర్చ – పని లేని టీడీపీ నేతల పంచాయతీ !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి మొన్నటిదాకా వైసీపీ నేతలు రాజకీయం చేసేవారు. టీడీపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించేవారు. రకరకాల బ్యానర్లు టీడీపీ ర్యాలీల్లో వైసీపీ కార్యకర్తలే తీసుకు వచ్చారు. ఇక...

తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవే…!?

పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ విషయంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్న ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close