శ్రీ‌దేవి కూతురు బాగా ఫీలౌతోంది

స్టార్ డ‌మ్ మోయ‌డం అంత సుల‌భం కాదు. స్టార్ కిడ్ అనేది కూడా ముళ్ల కిరీట‌మే. పోలిక‌లు మొద‌లైపోతాయి. అంచ‌నాలు పెరిగిపోతాయి. అభిమానుల ఆశ‌లు నెర‌వేర్చ‌డం, వాళ్ల అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగా రాణించ‌డం అంత సుల‌భం కాదు. ఆ క‌ష్టం ఎలా ఉంటుందో శ్రీ‌దేవి కుమార్తెల‌కు త్వ‌ర‌గానే అర్థ‌మైంది.

శ్రీ‌దేవికి ఇద్ద‌రు కుమార్తెలు. ఒక‌రు జాన్వీ, ఇంకొక‌రు ఖుషి. జాన్వి క‌థానాయిక‌గా త‌న‌ని తాను రుజువు చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఖుషి కూడా త్వ‌ర‌లోనే వెండి తెర‌పై అడుగులు వేయ‌డానికి సిద్ధ‌ప‌డుతోంది. ఈలోగా న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటోంది. అయితే ఖుషికి ఆదిలోనే హంస పాదు అన్న‌ట్టు విమ‌ర్శ‌ల తాకిడి ఎక్కువైంది. చాలామంది `నువ్వు మీ అమ్మ‌లా అంద‌గ‌త్తెవి కావు. క‌నీసం అక్క‌లా ఆక‌ర్షించే రూపం కూడా లేదు` అని డైరెక్టుగానే కామెంట్లు చేసేస‌రికి బాగా హ‌ర్ట‌యిపోయింది.

అందుక‌నే…. ఖుషి ఓ ఆడియో ఫైల్‌ని త‌న ఇన్‌స్ట్రా లో ఉంచింది. అందులో త‌న అనుభ‌వాలు, బాధ‌లూ అభిమానుల‌తో పంచుకుంది. చాలామంది త‌న‌ని ప్రేమిస్తున్నార‌ని, లెక్క‌కు మించిన అభిమానం చూపిస్తున్నార‌ని, అదంతా త‌న‌కు చాలా సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని, అయితే కొంత‌మంది లేనిపోని పోలిక‌లు తీస్తున్నార‌ని, అమ్మ‌లా లేవు, అక్క‌లా లేవు అంటూ జోకులు వేస్తున్నార‌ని బాధ ప‌డిపోయింది. రూప‌లావ‌ణ్యాలు వేసుకునే దుస్తుల్ని, ప్ర‌వ‌ర్తించే విధానాన్ని బ‌ట్టి మారిపోతాయ‌ని, త‌న‌కంటూ ఓ వ్య‌క్తిత్వం, గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని, వాటిని త‌న ప్ర‌తిభ‌తో సాధించుకోవ‌డానికి శ్ర‌మిస్తాన‌ని త‌న అభిమానుల‌కు మాటిచ్చింది. అభిమానుల ప్రేమ ఓ బ‌హుమ‌తి లాంటిద‌ని, అయితే దాన్ని అందుకునే అర్హ‌త త‌న‌కు ఉందో లేదో తెలీద‌ని, కానీ ఆ అర్హ‌త సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని అభిమానుల‌కు మాటిచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close