కృష్ణా నీళ్ల జోలికి రావొద్దని సింపుల్‌గా చెప్పిన కేసీఆర్..!

” రాయలసీమకు నీటిని తీసుకెళ్లాలి. గోదావరి మిగులు జలాల నుంచి తీసుకెళ్లాలి..! ” … ఇదీ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటూ.. సంగమేశ్వరం ఎత్తిపోతలను నిర్మించుకునేందుకు ఏపీ ఇచ్చిన జీవో నెం 203పై కేసీఆర్ స్పందన. కొట్లాటలు పెట్టుకోబోమని చాలా శాంతంగా చెప్పారు. కానీ కేసీఆర్ వ్యాఖ్యలో ఓ రకమైన హెచ్చరికలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. రాయలసీమ ఉంది.. కృష్ణా బేసిన్‌లోనే. గోదావరి నీరు రాయలసీమలో పారాలంటే.. అంత తేలికగా సాధ్యమయ్యే వ్యవహారం కాదు. లక్షల కోట్లు వెచ్చించాలి.. ఇంజనీరింగ్ అద్భుతాలు చేయాలి… ఇవన్నీ జరిగే సరికి ఏళ్లుపూళ్లు పడుతుంది.

కృష్ణా జలాల్లో ఏపీకి వాటా లేదన్నట్లుగా కేసీఆర్ వాదన..!

గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని.. వాటిని రాయలసీమకు తరలించాలని.. కేసీఆర్ చెబుతున్నారు. గోదావరి నీళ్లతో రాయలసీమను బాగుచేసుకోమని చెప్పాం..కృష్ణా జలాలను వాడుకుంటామంటే క్షమించేది లేదని మొహమాటం లేకుండా తేల్చేశారు. …అంటే.. కృష్ణా నీటిపై ఆశలు వదిలేసుకోవాలని ఆయన చెప్పడమే. శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి.. తెలంగాణకు మాత్రమే నీళ్లు దక్కుతాయని.. రాయలసీమకు అందులో వాటా లేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సీమకు నీళ్లు తీసుకెళ్లాలంటే.. గోదావరి నుంచి శ్రీశైలంకు మళ్లించి ఆ నీటిని మాత్రమే తీసుకెళ్లమంటున్నారు. అయితే.. కృష్ణా నీటి కేటాయింపుల్లో.. తమ వాటాను మాత్రమే వినియోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది. కానీ కేసీఆర్ ఈ వాదనను పట్టించుకోవడం లేదు. కృష్ణా నీటిలో.. దిగువ రాష్ట్రమైన ఏపీకి హక్కు లేదన్నట్లుగా వాదిస్తున్న అభిప్రాయం కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే సహించబోమని ఆయన మొహమాటం లేకుండా చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం.. తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ లైట్ తీసుకుంటారని.. ఎవరూ అనుకోరు.

బేసిన్లు.. భేషజాలు లేవంటే అర్థం ఇదా..?

కృష్ణా నీటిలో ఏపీ వాటాను పూర్తిగా రాయలసీమకు తరలించేందుకు గత ప్రభుత్వం… గోదావరి నీటిని పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించింది. దాంతో.. శ్రీశైలంకు వచ్చిన వరదను.. నేరుగా.. రాయలసీమకు తరలించే అవకాశం ఏర్పడింది. ఈ కారణంగా సీమకు నాలుగేళ్ల పాటు ఎక్కువగా నీరు లభించింది. అదే సమయంలో.. నాగార్జున సాగర్‌కు నీటి విడుదల, లభ్యత తగ్గిపోయింది. ఇది నల్లగొండ, ఖమ్మం జిల్లాల తెలంగాణ రైతులకు ఇబ్బందికరంగా మారింది. పట్టిసీమ ద్వారా ఏపీ డెల్టాలోని కృష్ణా బేసిన్ పంటలకు నీటి కొరత రాలేదు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్ట్‌లోకి కొద్దిగా నీరు చేరగానే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేసి..నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉంటుంది.

కృష్ణాలో వాటా కాపాడుకోకపోతే.. సీమ ఏడారే..!

విభజనలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలంల నిర్వహణ చెరో రాష్ట్రానికి వచ్చింది. శ్రీశైలం నిర్వహణ ఏపీకి వచ్చింది. అయితే.. శ్రీశైలంలో చేరే నీరును వచ్చినది వచ్చినట్లుగా తోడుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉంది. వరద వస్తున్నప్పుడే.. 800 అడుగులకు చేరుకోగానే కల్వకుర్తి సహా పలు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ నీరు తోడుకుంటోంది. కానీ ఏపీకి ఆ అవకాశం 841 అడుగులు వచ్చిన తర్వాతే వస్తోంది. అయితే.. కృష్ణా బోర్డు కేటాయించాలి. కానీ వరదల సమయంలో రెండు రాష్ట్రాలు నీటిని తోడుకుంటున్నాయి. ఇప్పుడు.. కేసీఆర్ భిన్న వ్యూహంతో… కృష్ణా నీరు.. దిగువకు వస్తుందా.. అన్న సందేహం చాలా మందిలో ప్రారంభమవుతోంది. అందుకే ఏపీ సర్కార్ మరింత గట్టిగా వ్యవహరించాల్సిన సందర్భం వచ్చిందంటున్నారు.
కొసమెరుపేమిటంటే… గోదావరి మిగులు జలాలను సీమకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చిన కేసీఆర్… గోదావరిలో నికర జలాలే కాకుండా మరో 650 టీఎంసీల మిగులు జలాల హక్కులు తెలంగాణకు ఉన్నాయని చెప్పుకోవడం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close