కృష్ణా నీరు తరలించడం నిలిపివేయాలని ఏపీకి బోర్డు ఆదేశం..!

కృష్ణా జలాల్లో ఈ ఏడాదికి వాటా పూర్తిగా వాడేసుకున్నారని..ఇక ఒక్క చుక్క కూడా వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవోను ఏపీ సర్కార్ విడుదల చేయడంతో ఏర్పడిన వివాదం పెద్దదవుతున్న సమయంలో.. కేఆర్ఎంబీ ఏపీకి ఈ ఆదేశాలివ్వడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో అందుబాటులో ఉన్న నీటిని.. సాగర్‌ కుడికాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి ఏపీ తరలించుకుంటోంది. ఇక నుంచి ఆ మూడింటిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన దాని కన్నా ఎక్కువే వాడుకున్నారని కేఆర్ఎంబీ లెక్కలు చెబుతోంది. కృష్ణా జలాల నీటి లభ్యత 980 టీఎంసీలు ఉండగా… ఏపీకి 647, తెలంగాణకు 333 టీఎంసీలు కేటాయించాయి. ఈ కేటాయింపుల్లో ఇప్పటి వరకూ.. ఏపీ 647.5… తెలంగాణ 272 టీఎంసీలు వినియోగించుకున్నాయని.. అంటే ఏపీ కోటా పూర్తయిపోయి.. మరో అర టీఎంసీ అదనంగా వాడుకున్నారని కృష్ణాబోర్డు స్ఫష్టం చేసింది. తెలంగాణకు మరో 56 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని… ప్రస్తుంత కృష్ణాలో 60 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందని స్పష్టం చేసింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని .. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని ఏపీకి ఈఎన్సీకి కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.

కేఆర్ఎంబీ తాజా ఉత్తర్వులతో… సాగర్ కుడికాల్వతో పాటు…రాయలసీమకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ తరలించిన నీటిని కృష్ణాకు వరద వచ్చి ఎగువ ప్రాజెక్టులు అన్నీ నిండి..శ్రీశైలంకు వచ్చే వరకూ వాడుకోవాల్సి ఉంటుంది. వరద రావడం ఆలస్యం అయితే.. రాయలసీమ తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close