చిరంజీవి మీద విరుచుకుపడ్డ ఏబీఎన్ , టీవీ5

ముఖ్యమంత్రి జగన్ తో సమావేశానికి వచ్చిన తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అమరావతి రైతుల నుండి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలోని ఈ బృందం విజయవాడ కి చేరుకోగానే కొంతమంది రైతులు వచ్చి అమరావతి ని రాజధానిగా కొనసాగించేలా జగన్ తో మాట్లాడాలని ప్లకార్డులు చూపిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి నాగార్జున సురేష్ బాబు రాజమౌళి తదితరులతో కూడిన ఈ బృందం ధర్నా చేస్తున్న రైతుల తో ఎటువంటి భేటీ జరపకుండా వెళ్లిపోయారు.

డిబేట్ పెట్టి చిరంజీవి ని ఏకిపారేసిన ఏబీఎన్ ఛానల్:

అయితే ఈ పరిణామాల మీద డిబేట్ పెట్టిన వేమూరి రాధాకృష్ణకు చెందిన ఏబీఎన్ ఛానల్ చిరంజీవిని ఏకి పారేసింది. అయిదారుగురు పాల్గొన్న ఆ డిబేట్ లో చిరంజీవి తరపున వాయిస్ వినిపించిన ఒక వ్యక్తిని మిగతా అందరూ కలిసి టార్గెట్ చేసి చెడుగుడు ఆడుకున్నారు. రైతు సమస్యల మీద సినిమాలు తీసే హీరోలు రైతుల పక్షాన నిలబడరా? రైతులతో వినతిపత్రాన్ని తీసుకుని ఉంటే చిరంజీవి సొమ్మేం పోతుంది? వచ్చిన రైతులతో చర్చించడం కనీస సంస్కారం, అది కూడా లేకుండా చిరంజీవి వ్యవహరించడం దారుణం అంటూ ప్రయోక్త వెంకట కృష్ణ వీరావేశంతో వ్యాఖ్యలు చేశారు. టీవీ5 మూర్తి కూడా ఇదే తరహా డిబేట్ నిర్వహించారు.

చిరంజీవి మీద విరుచుకు పడడం పై మెగా అభిమానుల గుర్రు:

అయితే, అవకాశం వచ్చిన ప్రతిసారి చిరంజీవి మీద విరుచుకు పడడం ఏబీఎన్ చానల్కి అలవాటుగా మారిందని మెగా అభిమానులు అంటున్నారు. కరోనా సమయంలో చిరంజీవి ఏర్పాటు చేసిన కార్యక్రమాల ద్వారా అనేకమంది సినీ కార్మికులు లాక్ డౌన్ సమయం లో పస్తులు పడుకోవలసిన అవసరం లేకుండా చిరంజీవి ఆదుకున్నారు అని ఆ మధ్య జె డి చక్రవర్తి ఉత్తరం రాసిన సంగతిని వీరు గుర్తు చేస్తూ, అటువంటి కార్యక్రమాలు చేసిన బృందాన్ని అభినందించడం మానేసి ఏబీఎన్ ఛానల్ ఉద్దేశపూర్వకంగా చిరంజీవి పై బురదజల్లుతోంది అని వారు ఆరోపిస్తున్నారు. పైగా అక్కడ ఉన్న సినీ బృందం రాజకీయపరంగా వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, సినీ పరిశ్రమ సంబంధించిన సమస్యల కోసం ఏకమై వచ్చారని, ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న అమరావతిపై వారెలా స్పందించగలరని వీరు అంటున్నారు. బాలకృష్ణ మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినా, రోడ్డు మీద పరిగెత్తించి జర్నలిస్టులను కొట్టినా నోరుమెదపని చానల్స్ ఇప్పుడు చిరంజీవి రైతులకు అన్యాయం చేస్తున్నారని గంటల తరబడి డిబేట్ లు పెడుతున్నాయని వారంటున్నారు. ఏది ఏమైనా అనేక చానల్స్ నుండి తరచు ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టడం లో మెగా కుటుంబం విఫలమవుతోంది అని, తమకంటూ ఒక సొంత ఛానల్ ఏర్పరుచుకుంటే తప్ప వీరి మీద దాడి ఆగదని మెగా స్టార్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఏబీఎన్, టీవీ5 చానల్స్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాయి అన్న ముద్ర బలపడుతోందా?

ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో ఏబీఎన్, టీవీ ఫైవ్ ఛానల్స్ ప్రసారం కావడం లేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనధికారిక ఆంక్షలు ఉండడం వల్లే ఈ చానల్స్ ప్రసారం కావడం లేదన్న ప్రచారం ఉంది. నిజానికి ఇలా మీడియా చానల్స్ ఆపేసి నప్పుడు, ప్రజల వైపు నుండి ఆయా చానల్స్ కు మద్దతు పెరగడం, ఆ చానల్స్ రాకుండా చేసినందుకు ప్రభుత్వం పై వ్యతిరేకత కలగడం జరగాలి. కానీ ఈ రెండు చానల్స్ విషయంలో ప్రజల నుండి ఏమాత్రం స్పందన రావడం లేదు. పైగా సమస్య ఏదైనా ఈ రెండు చానల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వైఖరిని మాత్రమే వినిపిస్తాయి కాబట్టి కొత్తగా ఆ చానల్స్ చూసి తెలుసుకోవాల్సింది ఏముంది అని ఇతర పార్టీల అభిమానులతో పాటు తటస్థులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సినీ పరిశ్రమ ముఖ్యమంత్రి భేటీ నేపథ్యంలో సినీ పరిశ్రమ సమస్యల గురించి డిబేట్ పెట్టకుండా ఉండేందుకు ఈ ఛానల్స్ కావాలనే అమరావతి అంశాన్ని తెరమీదకు తెచ్చాయని మరొక వాదన వినిపిస్తోంది.

మొత్తం మీద సినీ పరిశ్రమ ముఖ్యమంత్రితో జరిపిన భేటీ కంటే, అమరావతి రైతుల అంశం ఎక్కువ హైలెట్ అయ్యేలా చేయడంలో ఈ రెండు చానల్స్ కొంత వరకు సక్సెస్ అయ్యాయనే వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close