“చేదోడు” లబ్దిదారులు నియోజకవర్గానికి 1500 మంది కూడా లేరేంటి..?

జగనన్న చేదోడ పథకానికి అతి తక్కువగా లబ్దిదారులను ఎంపి చేయడంపై.. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించింది. పాదయాత్రలో చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి… రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ. పదివేలు సాయం చేసేందుకు జగనన్న చేదోడు అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజే ఆ పథకం నిధులు లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అయితే.. మొత్తంగా.. రెండున్నర లక్షల మంది లబ్దిదారులు మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంపై… టీడీపీ మండిపడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ముఖ్యమంత్రి జగన్మాయ చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 5 లక్షల 50 వేల మంది నాయిబ్రాహ్మణులు ఉన్నారు. నాయీ బ్రాహ్మణలు ప్రతీ వీధిలోనూ ఉంటారు. ప్రతీ ఊరులోనూ ఉంటారు. అయితే.. కేవలం 38 వేల మందికే ఆర్థిక సాయం చేసింది. దీన్నే చంద్రబాబు ప్రశ్నించారు. యటం ఏమిటని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 38 వేల మంది నాయీ బ్రాహ్మణలకు సాయం పంపిణీచ ేయడం అంటే… ఒక్కో నియోజకర్గంలో అర్హులు సగటున 210 మంది మాత్రమే. దీనిపై టీడీపీనే తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో 13 లక్షల మంది టైలర్లు ఉన్నారని.. అందులో లక్షా 25 వేల మందికి ఆర్థిక సాయం చేస్తున్నారని.. నియోజకవర్గానికి సగటున ఐదు వందల మంది టైలర్లకు కూడా సాయం చేయడం లేదని మండిపడ్డారు. రజకులు 15 లక్షల మంది ఉంటే 82 వేల మందికే సాయం చేయటం సబబా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అతి తక్కువ మందికి సాయం చేయడంమే కాకుండా.. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం.. వారికి వెళ్లాల్సిన వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను 4 వేల కోట్లు దారి మళ్లించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం పథకాల లబ్దిదారులను మరీ తక్కువగా చేయడానికి.. అనేక రకాల నిబంధనలు పెడుతోందన్న విమర్శలు.. ఆయా పథకాలను ఆశిస్తున్న వారి నుంచి కూడా వస్తున్నాయి. సొంత దుకాణం ఉండాలి… కార్మిక శాఖలో రిజిస్టర్ చేసుకోవాలంటూ.. అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టడంతో.. కనీసం ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లలలో పది శాతానికి కూడా పథకం అందని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close