ఇన్‌సైడ్ టాక్‌: జ‌గ‌న్ మీటింగ్ పై బాల‌య్య ఆరా

కేసీఆర్ తో చిత్ర‌సీమ పెట్టుకున్న మీటింగ్‌కి నంద‌మూరి బాల‌కృష్ణ‌ని పిల‌వ‌లేదు. జ‌గ‌న్ తో మీటింగ్‌కి పిలిచినా బాల‌య్య వెళ్ల‌లేదు. అలా రెండు కీల‌క‌మైన స‌మావేశాలు బాల‌య్య లేకుండానే జ‌రిగిపోయాయి. అయితే… జ‌గ‌న్‌తో మీటింగ్ విశేషాల గురించి బాల‌య్య సినీ ప్ర‌ముఖుల‌ని ఆరా తీసిన‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌.

బుధ‌వారం బాల‌కృష్ణ త‌న పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా సి.క‌ల్యాణ్‌, సురేష్‌బాబు… బాల‌య్య‌ని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇటీవ‌ల జ‌గ‌న్ మీటింగ్‌కి వీళ్లిద్ద‌రూ వెళ్లి వ‌చ్చిన‌వాళ్లే. ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌… జ‌గ‌న్ మీటింగ్ విశేషాల్ని అడిగి తెలుసుకున్న‌ట్టు టాక్‌. జ‌గ‌న్ ఏయే విష‌యాల‌పై సానుకూలంగా స్పందించారో బాల‌య్య తెలుసుకోవ‌డానికి ఉత్సాహం చూపించార్ట‌. విశాఖ‌లో షూటింగ్ జ‌రుపుకోవ‌డానికి చాలా ఉత్సాహంగా ఉన్నాన‌ని బాల‌య్య స‌న్నిహితుల‌తో చెప్పుకొచ్చార్ట‌. నంది పుర‌స్కారాల విష‌యంపైనా బాల‌య్య ఆరా తీశార‌ని తెలుస్తోంది. బాల‌య్య మీటింగ్‌కి వెళ్ల‌క‌పోయినా, అక్క‌డి విశేషాల‌పై ఆస‌క్తి చూపించ‌డం క‌ల్యాణ్‌, సురేష్‌బాబు లాంటి వాళ్ల‌కు ఊర‌ట ఇచ్చే విష‌య‌మే. ఎందుకంటే… బాల‌య్య గైర్హాజ‌రీతో ఈ మీటింగుల‌కు కాస్త క‌ళ త‌ప్పిన‌ట్టైంది. బాల‌య్య‌తో కొంత‌మందికి గ్యాప్ కూడా వ‌చ్చింది. కానీ ఇప్పుడు బాల‌కృష్ణ స్పంద‌న‌తో కాస్త ఉప‌శ‌మ‌నం దొరికింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close