కరోనాపై ఏం చేయాలో కేసీఆర్ సర్కార్‌కు చెప్పిన హైకోర్టు..!

కరోనా విషయంలో నిర్లిప్తంగా ఉందని విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కరోనాకు సంబంధించిన కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ర్యాపిడ్‌ యాంటీజెంట్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించిందని హైకోర్టు గుర్తుచేసింది. ఐసీఎంఆర్‌ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని… స్పష్టం చేసింది. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే కాదని.. మరో 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు అందిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

అయితే.. గాంధీతో పాటు 54 ఆస్పత్రుల్లో.. కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని సూచించింది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం చెప్పాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని.. సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని ఆర్డర్స్ పాస్ చేసింది. పెద్దఎత్తున వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అలాగే.. టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న విమర్శలు ఎదురవుతున్నాయి.

వీటన్నింటి కారణంగా హైకోర్టు.. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తూ..స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు మృతదేహాలకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అలా చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకు వచ్చింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందో.. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తుందో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close