ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ టైం..!

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూండటంతో.. ఏపీ సర్కార్ మళ్లీ లాక్ డౌన్ పై దృష్టి పెట్టింది. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా.. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వరుసగా రెండు రోజులు.. నాలుగు వందలక కేసులుకుపైగా నమోదు కావడంతో.. కంగారుపడిన అధికార యంత్రాంగం… సడలింపులు తగ్గించడంపై దృష్టి పెట్టింది. ముందుగా అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ మూడు జిల్లాల్లో సూపర్ స్ప్రెడర్లు ఎక్కువగా ఉన్నారని గుర్తించారు. సడలింపులు కారణంగా.. ఒకరి నుంచి.. మరొకరికి… అలా.. పెద్ద ఎత్తున సోకుతూ పోతోంది. దీంతో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని గుర్తించారు.

అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే గన్‌మెన్.. మరో ప్రజాప్రతినిధి బంధువు.. ఇలా పలువురు చనిపోయారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఇతరులకు సోకింది. శ్రీకాకుళం జిల్లాలో ఒకప్పుడు.. ఒక్క కేసు కూడా ఉండేది కాదు. కానీ తర్వాత కేసులు బయటపడటం ప్రారంభమయ్యాయి. వలస కూలీల రాక తర్వాత… శరవేగంగా సెకండ్ స్టేజ్‌కి చేరుకుంది. దీంతో.. అక్కడా లాక్ డౌన్ విధించక తప్పలేదు. ప్రకాశం జిల్లాలోనూ సూపర్ స్ప్రెడర్లు ఎక్కువగా ఉన్నారని అంచనా వేసిన అధికారులు.. కీలక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇప్పకే భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను కట్టడి జోన్లుగా ప్రకటించారు. అక్కడ రాకపోకల్ని నియంత్రిస్తున్నారు.

ఏపీలో కొన్నాళ్ల కిందటి వరకూ.. కరోనా కంట్రోల్‌లోనే ఉండేది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో… దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. పరిస్థితులు మెరుగ్గా ఉండేవి. కానీ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. పెద్ద పెద్ద నగరాలు లేకపోయినా… మద్యం దుకాణాలు ప్రారంభించడంతో కరోనా కేసులు విజృంభించడం ప్రారంభించాయి. ప్రజాప్రతినిధులు సహా ప్రజలు కూడా కరోనా విషయాన్ని లైట్ తీసుకోవడంతో మళ్లీ ఆంధ్ర..లాక్ డౌన్ దిశగా వెళ్తున్నట్లుగా అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close