తెలంగాణ రైతుల అకౌంట్లలో రూ. 5,249 కోట్లు..!

రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని.. విపక్షాలు చేస్తున్న విమర్శలకు తెలంగాణ సర్కార్ ఒకే సారి చెక్ పెట్టింది. అందరి అకౌంట్లలోకి పథకం నిధులు ట్రాన్స్‌ఫర్ చేసింది. దాదాపుగా 51 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి రైతులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం లబ్దిదారులు 40 లక్షలు మాత్రమే. తెలంగాణ సర్కార్ మాత్రం.. కులం చూడకుండా.. మతం చూడకుండా… అందరికీ.. పథకాన్ని వర్తింప చేసింది. అందుకే ఏపీ సర్కార్ ఇచ్చే దాని కన్నా రెండింతలు ఇస్తోంది. రైతు భరోసాకి ఏపీ సర్కార్ బడ్జెట్‌లో రూ. 3150 కోట్ల వరకూ కేటాయించింది. కానీ తెలంగాణ సర్కార్.. ఒక్క విడతలోనే రూ. 5200 కోట్లను విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపులు రూ. పన్నెండు వేల కోట్లు.

ఇంత భారీ చెల్లింపులు చేస్తున్నప్పుడు… ప్రభుత్వాలు కాస్త పబ్లిసిటీ చేసుకుంటాయి. యాభై, అరవై వేల మందికి సాయం చేసే పథకం అమలు చేసినా.. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాయి. అయితే.. తెలంగాణ సర్కార్ అలాంటి ఖర్చులేమీ పెట్టుకోలేదు. ప్రత్యేకంగా పబ్లిసిటీ సమావేశాలు పెట్టలేదు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. గొప్పలు చెప్పుకోలేదు. కానీ సాయం మాత్రం నేరుగా జమ చేసింది. వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున 1.40 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రకారం 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏక కాలంలో దాదాపు రూ.5,295 కోట్లు చేరాయి.

5 లక్షల మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు సరిగా లేకపోవటం, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, రాంగ్‌ నంబర్లు ఉండటంతో పెండింగ్‌లో పెట్టారు. రైతుబంధు పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు చెక్కులు ఇచ్చారు. తర్వాత మూడు విడతల్లో డబ్బుల మంజూరు, పంపిణీలో జాప్యం జరిగింది. ఈసారి అలాకాకుండా ఒక్క రోజులోనే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close