అచ్చెన్న అరెస్ట్‌లోనే కాదు.. డిశ్చార్జ్‌లోనూ అర్థరాత్రి హంగామానే..!

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎలాగైనా జైలుకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉంది. కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చిన తర్వాత అర్థరాత్రి ఆయనను హడావుడిగా డిశ్చా‌ర్జ్ చేసి జైలుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం కలకలం రేపడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి అర్థరాత్రి డిశ్చార్జ్‌ను విరమించుకున్నా.. ఏ క్షణమైనా డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కోర్టు .. ఏసీబీ విచారణ కోసం మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. ఇలా ఇచ్చే ముందు అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వాసుపత్రి నుంచి తెలుసుకుంది. అప్పుడు అధికారులు మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉందని.. రిపోర్ట్ ఇచ్చారు.

ఆ రిపోర్ట్ ఆధారంగానే.. ఏసీబీ కోర్టు.. అచ్చెన్నాయుడుని… ఆస్పత్రిలోనే .. విచారించారని.. ఆయన మంచం మీద పడుకునే సమాధానాలు ఇచ్చినా అభ్యంతరం లేదని.. న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని ఆదేశించింది. ఇక .. అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే కస్టడీకి తీసుకుంటారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అర్థరాత్రి ప్లాన్ మార్చేశారు. ఎస్పీ ఆస్పత్రిని సందర్శించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు. ఆ తర్వాత ఆస్పత్రి అధికారులు డిశ్చార్జ్ పత్రం జారీ చేసేశారు. కోర్టుకు ఓ రకంగా చెప్పి.. ఇప్పుడు అప్పటికప్పుడు డిశ్చార్జ్ రాసేయడం ఏమిటన్న ప్రశ్నకు.. ఆస్పత్రి అధికారుల వద్ద సమాధానం లేదు. పై అధికారులు చెప్పారని.. తాము చేశామని సమర్థించుకుంటున్నారు.

అయితే.. పోలీసులు, ప్రభుత్వం తీరు మరో సారి చర్చనీయాంశం కావడమో.. కోర్టు ధిక్కరణ అవుతందని భయపడ్డారో కానీ… అర్థరాత్రి డిశ్చార్జ్ ప్రాసెస్‌ను నిలిపివేశారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడిని ఏసీబీ ఆస్పత్రిలోనే ప్రశ్నించాల్సి ఉంది. అర్థరాత్రి జారీ చేసిన డిశ్చార్జ్ లెటర్ ప్రకారం.. ఏ క్షణమైనా ఆయనను జైలుకు లేదా.. ఏసీబీ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తారో.. లేకపోతే మనసు మార్చుకుని ఆస్పత్రిలోనే కస్టడీలోకి తీసుకుంటారో కొంత సేపట్లో తేలే అవకాశం ఉంది. ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్పినా హడావుడిగా అరెస్ట్ చేసి.. ఆస్పత్రి పాలయ్యేలా చేసిన అదికార యంత్రాగం.. ఇప్పుడు… డిశ్చార్జ్ లోనూ అదే హంగామా చేస్తూండటంతో.. అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close