“నిరుపయోగ” రూల్స్ అమరరాజాకేనా..? అందరికీనా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరరాజా సంస్థకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై..రాజకీయ దుమారం మాత్రమే కాదు.. పారిశ్రామికవర్గాల్లోనూ ఆశ్చర్యకర చర్చ జరుగుతోంది. సేల్ డీడ్ ప్రకారం.. అమ్మకం పద్దతిలో ఆ భూములు అమరరాజాకు..వైఎస్ హయాంలో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇది కోర్టుల్లో నిలబడకపోవచ్చు. కానీ పారిశ్రామిక రంగంలో మాత్రం… రాజకీయ కక్ష సాధింపులపై కొత్త చర్చ ప్రారంభమైంది.

క్రిస్టియన్ కాలేజీకి… గల్లా సంస్థకు వేర్వేరు రూల్సా..?

చిత్తూరు జిల్లాలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ… సీఎంసీ పేరుతో ఓ మెడికల్ కాలేజీ ఉంది. వేలూరు దగ్గర ఉన్న ఈ ఆస్పత్రి మొత్తం 14 ఎకరాల్లోపే వాడుకుంటోంది. రెండు, మూడు ఎకరాల్లోపే భవనాల విస్తీర్ణం ఉంటుంది. కానీ ఈ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది.. ఏకంగా 640 ఎకరాలు. అదీ కూడా కేటాయించి పదేళ్లు దాటిపోయింది. 2010లో కేటాయిచారు. ఆ ఆస్పత్రి ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్‌ కార్డులకు.. సామాన్య ప్రజల ఆరోగ్యశ్రీ కార్డులకు చికిత్స చేయరు. 625 ఎకరాలకుపైగా భూమి.. ఆ ఆస్పత్రి చేతుల్లో నిరుపయోగంగానే ఉంది. ఇప్పుడు ఆ భూమి విలువ కొన్ని వందల కోట్లు చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం.. అది నిరుపయోగంగా భావించడం లేదు. అమరరాజా బ్యాటరీస్ ..ఈ పేరు ప్రపంచ బ్రాండ్. ఇది గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. వెనుకబడిన చిత్తూరు జిల్లాకు పారిశ్రామిక రూపు ఆ కుటుంబం ద్వారానే వచ్చింది. పరిశ్రమ విస్తరణ కోసం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూములు కేటాయించారు. వాటికిఆ సంస్థ నిధులు చెల్లించింది. 2009 ఫిబ్రవరిలో ఈ మేరకు 483.27ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎకరం రూ.1.80 లక్షల చొప్పున ఈ భూములను అమ్మకం పద్ధతిలో ఇచ్చారు. కేటాయించిన భూమిలో 229 ఎకరాలు అభివృద్ధి చేసి, డిజిటల్‌ వరల్డ్‌ సిటీ ఇండస్ర్టియల్‌ పార్కుగా విస్తరించారు. 4,310 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అయితే మిగతా 253.61 ఎకరాలను ఇప్పటికీ అభివృద్ధి చేయలేదని.. రూ.2,100 కోట్ల పెట్టుబడిని పెడతామని చెప్పి చేయలేదని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసేశారు.

ఊరూపేరూ లేని సంస్థలకు వందల ఎకరాలు..!

అమరరాజా గ్రూప్.. దేశంలో అత్యధిక పన్నులు చెల్లిస్తున్న సంస్థల్లో ఒకటి మాత్రమే కాదు. చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ. ఆ సంస్థ.. ఇవాళ కాకపోతే.. రేపైనా ఆ భూముల్లో పారిశ్రామిక వృద్ధి చేసి చూపిస్తుంది. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంస్థలు భూములు కేటాయించింది. అందులో వీర బస్సుల ఫ్యాక్టరీ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తామని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు తయారు చేసుకునే పరిశ్రమ అడిగితే..అనంతపురం జిల్లాలో 120 ఎకరాల భూమి కేటాయించేందుకు కసిద్ధమయ్యారు. ఇంటలిజెంట్ ఫుట్‌వేర్ సెజ్ అంటూ.. చిత్తూరు జిల్లాలోనే ఆరు వందల ఎకరాలు కేటాయిస్తామని ప్రకటించారు. అసలు వెబ్‌సైట్.. ముగ్గురు ఉద్యోగాలు ఉన్న పరిశ్రమ.. పశువుల వ్యాక్సిన్స్ తయారు చేస్తమని వస్తే.. పులివెందులలో యాభై ఎకరాలు కేటాయించారు. ఊరూపేరూ లేని కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు కేటాయిస్తున్న సర్కార్.. పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఉపాధి కల్పిస్తూ.. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్న దిగ్గజ సంస్థ నుంచి మాత్రం భూములు లాగేసుకుంటూ… పారిశ్రామిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దిగ్గజ సంస్థలపై రాజకీయ కక్ష సాధిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా..?

అమరరాజా గ్రూప్‌కు కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవడం… క్రిస్టియన్ మెడికల్ కాలేజీ భూముల జోలికి వెళ్లకపోవడం..ఊరూపేరూ లేని సంస్థలకు వందల ఎకరాలు కేటాయించడం.. అనేక చర్చలకు కారణం అవుతోంది. రాజకీయ కక్షలతో.. పారిశ్రామికవేత్తలపై ఇలాంటి ప్రభుత్వ పరమైన దాడులు చేస్తే.. పారిశ్రామిక రంగానికే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమరరాజా గ్రూప్.. ఈ నిర్ణయంపై కోర్టుకు వెళ్లవచ్చు. కానీ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పారిశ్రామికవేత్తల్లో ఓ రకమైన భయాందోళనకు కారణం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కేటాయిస్తే.. వచ్చే ప్రభుత్వం రద్దు చేయదని గ్యారంటీ ఏమిటన్న చర్చ జరిగితే.. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికే ఆటంకం. కానీ ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ ఆలోచించే పరిస్థితిలో లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close