మీడియా వాచ్‌: ఫిల్మ్‌సిటీకి పాకిన క‌రోనా

మీడియా రంగాన్ని క‌రోనా కుదిపేస్తోంది. ముఖ్యంగా రిపోర్ట‌ర్లు క‌రోనా బారీన ప‌డ‌డం పాత్రికేయుల‌కు కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవ‌ల సోమాజీ గూడ ఈనాడు కార్యాలయంలోని ఉద్యోగుల‌కు రాండ‌మ్ గా టెస్టులు చేయిస్తే – ప‌ద‌హారు మంది క‌రోనా బారీన ప‌డిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఇప్పుడు ఈ క‌రోనా సెగ రామోజీ ఫిల్మ్‌సిటీకీ చేరింది. ఈనాడుకి చెందిన ప్ర‌ధాన పాత్రికేయ ద‌ళం ఫిల్మ్‌సిటీలోనే ఉంది. దాదాపు 80 శాతం ఉద్యోగులు అక్క‌డ ప‌నిచేస్తున్నారు. ఓ డెస్కులోని ఇద్ద‌రు స‌భ్యుల‌కు క‌రోనా పాజిటీవ్ సోక‌డంతో.. ఫిల్మ్‌సిటీలోని ఓ ఫ్లోర్‌లో ప‌నిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగుల‌కు ఈరోజు క‌రోనా టెస్టులు చేయించారు. వారంద‌రి రిపోర్టులూ రావాల్సివుంది. ఈలోగా ఈ ఉద్యోగుల‌కుంద‌రికీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ప‌ద్ధ‌తిలో ప‌నిచేసే సౌక‌ర్యం క‌ల్పించారు. ఈ యాభై మందిలో కొంత‌మందికి అప్పుడే క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కొంత‌మందిలో ఈ లక్ష‌ణాలు లేక‌పోయినా, లోలోప‌ల భ‌యంతోనే గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికే చాలామంది ఉద్యోగులు, ముఖ్యంగా రిపోర్ట‌ర్లు సెల‌వులో ఉన్నారు. తాజా ప‌రిణామంతో యాభై మంది ఉద్యోగుల‌లో చాలామంది సెల‌వ‌లు తీసేసుకున్నారు. దాంతో త‌గు స్థాయిలో సిబ్బంది లేక ఈనాడు స‌త‌మ‌త‌మ‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close