తెర వెనుక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప‌నులు

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ షూటింగ్ అప్ డేట్ కోసం అటు చ‌ర‌ణ్‌, ఇటు తారక్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా స‌రే, షూటింగ్ మొద‌లెట్టాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నా, ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా రిస్క్ చేయ‌డం అటు రాజ‌మౌళికి గానీ, ఇటు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు గానీ ఏమాత్రం ఇష్టం లేదు. అలాగ‌ని `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ప‌నులేం సాగ‌డం లేద‌ని కాదు. తెర వెనుక చేయాల్సిన ప‌నుల‌న్నీ రాజ‌మౌళి పూర్తి చేస్తూనేఉన్నారు.

ఈ సినిమాకి సంబంధించిన యానిమేష‌న్ పార్ట్‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతోంద‌ని స‌మాచారం. క‌థ‌లో కొన్ని స‌న్నివేశాల్ని యానిమేష‌న్‌కి రూపంలో చూపించ‌బోతున్నార్ట‌. ఆయా స‌న్నివేశాలకు సంబంధించిన ప‌నులు ఇప్పుడు జ‌రుగుతున్నాయి. కొమ‌రం భీమ్‌, అల్లూరి నేప‌థ్యాల‌ను రాజ‌మౌళి యానిమేష‌న్ లో ప్రేక్ష‌కుల‌కు వివ‌రించ‌బోతున్నార్ట‌. క్లైమాక్స్ లో కూడా కొమ‌రం, అల్లూరి ఎవ‌రెవ‌రు ఏయేదారుల్లో స్వాతంత్య్ర పోరాటం చేశారు? ఎవ‌రి ముద్ర ఏమిటి? అనే విష‌యాల్ని కూడా యానిమేష‌న్ లో చూపించ‌బోతున్నార్ట‌. ఆయా స‌న్నివేశాలు ఇప్పుడు పూర్త‌వుతున్నాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి కూడా చోటుంది. ఇప్ప‌టికే తీసిన కొన్ని స‌న్నివేశాల్ని గ్రాఫిక్స్ స్టూడియోల‌కు పంపేశారు రాజ‌మౌళి. వాటికి సంబంధించిన ప‌ర్య‌వేక్ష‌ణ ప‌నులు కూడా సాగుతున్నాయ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

జూన్6 తర్వాత పెను మార్పులు… షా వ్యాఖ్యల అంతర్యమేంటి..?

జూన్ 6 తర్వాత తెలంగాణలో పెను మార్పులు ఉంటాయన్న అమిత్ షా వ్యాఖ్యల అంతర్యం ఏంటి..? మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సర్కార్ ను కూల్చుతామని షా వ్యాఖ్యల సంకేతమా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close