గ్రేటర్‌లో బీజేపీ పొలిటికల్ ఆపరేషన్..!

తెలంగాణలో పట్టు సాధించడానికి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని నమ్ముతున్న భారతీయ జనతా పార్టీ… ముందుగా హైదరాబాద్‌పై దృష్టి పెట్టింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. వచ్చే జనవరిలో కార్పొరేటర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఏ ఎన్నికలూ నిర్వహించే పరిస్థితి లేదు. కానీ.. ముందు ముందు పరిస్థితి మెరుగుపడుతుందని.. ఎన్నికలు జరుగుతాయని ఆశాభావంతో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలు.. ప్రత్యేకంగా హైదరాబాద్ టార్గెట్‌గా రాజకీయం ప్రారభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… కార్యక్షేత్రం హైదరాబాద్ కావడంతో.. ఆయన ఎన్నికలను మరింత సీరియస్‌గా తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌లో పట్టు సాధిస్తే తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని బీజేపీ ముఖ్యనేతలు అంచనాకు వచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి బండి సంజయ్ .. హైదరాబాద్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కలిసి గ్రేటర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహించి కేడర్‌ను పెంచుకోవాలని నిర్మయించుకున్నారు. దీని కోసం.. మొత్తం గ్రేటర్‌ను నాలుగు భాగాలుగా విభజించుకుని నలుగురు బాధ్యత తీసుకున్నారు.

హైదరాబాద్ రాజకీయాల్లో ఆరెస్సెస్ తెర వెనుక పాత్ర కీలకంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ బలపడినా.. దాని వెనుక బ్యాక్ గ్రౌండ్ మాత్రం.. ఖచ్చితంగా ఆరెస్సెస్ దే అయి ఉంటుంది. ప్రణాళికాబద్దంగా .. హైప్ లేకుండా… ప్రచారం చేయడం ఆరెస్సెస్ ప్రత్యేకత. అందుకే.. ఆరెస్సెస్ ముఖ్య నేతలతోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. వారి అభీష్టం మేరకు.. గ్రేటర్‌లో పార్టీ పదవులు పంపకం చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన శక్తిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌లో వారు బలపడితేనే.. ఆ ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close