లీకు వెనుక స్టోరీ: వ‌ర్మ వెబ్ సైట్ హ్యాక్?

ట్రైల‌ర్ ని పాతిక రూపాయ‌ల‌కు అమ్మేసి – కేవ‌లం ట్రైల‌ర్‌తోనే సినిమా బ‌డ్జెట్ ని వెన‌క్కి లాగేయాల‌న్న మ‌హ‌త్త‌ర‌మైన వ‌ర్మ ఐడియా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ట్రైల‌ర్ ముందే లీకైపోయింది. ఇక గ‌త్యంత‌రం లేక‌.. ట్రైల‌ర్‌ని ఉచితంగా విడుద‌ల చేయాల్సివ‌చ్చింది. ట్రైల‌ర్ కోసం డ‌బ్బులు క‌ట్టిన వాళ్లంద‌రికీ తిరిగి డ‌బ్బులు చెల్లించేశాడు వ‌ర్మ‌.

ఈ ట్రైల‌ర్ లీకైందా? లీక్ చేశారా? అనే కొత్త ప్ర‌శ్న ఉద‌యించింది. వ‌ర్మ కావాల‌నే ట్రైల‌ర్ లీక్ చేశాడ‌ని, అది బ‌హిరంగ ర‌హ‌స్య‌మ‌ని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే… వ‌ర్మ ట్రైల‌ర్ లీక్ చేయాల్సిన ప‌రిస్థితుల్ని క‌ల్పించింది ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం. దాని వెనుక పెద్ద ప్లానే వేశారంతా.

ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ అనేవెబ్ సైట్‌లో ట్రైల‌ర్‌ని ఉంచాడు వ‌ర్మ‌. అందులోకివెళ్లి.. టికెట్ బుక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సర్వ‌ర్ నైజీరియాలో ఉంద‌ట‌. ఆ స‌ర్వ‌ర్‌ని కొంత‌మంది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ హ్యాక్ చేసిన‌ట్టు తెలుస్తోంది. `నా ట్రైల‌ర్‌చూడ్డానికి 20 వేల మంది టికెట్లు కొన్నారు` అని వ‌ర్మ చెప్ప‌డం మొద‌లెట్టాడు. ట్రైల‌ర్ విడుద‌లైన రోజు.. ల‌క్ష‌ల మంది చూశారు అని బుకాయించ‌గ‌ల‌డు కూడా. నిజానికి ముంద‌స్తుగా బుక్ అయిన టికెట్లు వెయ్యి కూదా దాట‌లేద‌ట‌. ఆ వివ‌రాల్ని స్క్రీన్ షాట్స్ తీసి వ‌ర్మ‌కి పంపార్ట‌. స‌ర్వ‌ర్‌ని హ్యాక్ చేయ‌డంతో ట్రైల‌ర్‌ని ఎంత మంది చూశారో జ‌నాల‌కు ఈజీగా తెలిసిపోయే ఛాన్సుంది. పైగా ల‌క్ష‌ల్లో చూడాల్సిన ట్రైల‌ర్ వంద‌ల‌కు, వేల‌కు ప‌రిమితం అవుతుంది. అది త‌న సినిమాకి మంచిది కాదు. అందుకే.. వ‌ర్మ కావాల‌నే ట్రైల‌ర్ లీక్ చేశాడంటున్నారు. మ‌రి ఈ హ్యాకింగ్ విష‌యాన్ని వ‌ర్మ పోలీసుల వ‌ర‌కూ తీసుకెళ్తాడా? లేదంటే లీక్ చేసింది త‌నే కాబ‌ట్టి ఊరుకుంటాడా? ఏమో… వ‌ర్మ ఏమైనా చేస్తాడు. త‌న సినిమాకి పావ‌లా ప్ర‌చారం వ‌స్తుందంటే ఎంత‌కైనా తెగిస్తాడు. మ‌రి ఈసారి వ‌ర్మ ఏం చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close