ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని… కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా అంటూ.. దాఖలైన పిటిషన్ విషయంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటి వరకూ ఇదే చెబుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని.. కేంద్రం ఎప్పటికి జోక్యం చేసుకోబోదని చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్లగానే కేంద్రం తరపున అధికారికంగా క్లారిటీ వచ్చినట్లయింది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తొలగించి.. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నప్పటి నుండి.. అదెలా సాధ్యమన్న చర్చ జరుగుతోంది. రైతుల త్యాగాలను కించ పర్చవద్దంటూ… కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. సుజనా చౌదరి వంటి కొంత మంది బీజేపీ నేతలు కూడా ఇదే అంశాన్ని చెబుతూ వచ్చారు. అయితే.. చివరికి కేంద్రం తమకు సంబంధం లేదని… వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. వాస్తవానికి అడ్డుకోవాలనుకుంటే.. కేంద్రానికి ఒక్క నిమిషం పని. ఆ విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరికైనా తెలుస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంలో న్యాయస్థానాలు.. న్యాయం చెప్పాలి తప్పితే.. కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందన ఉండదని… తాజా అఫిడవిట్‌తో కేంద్రం తేల్చేసినట్లయింది. ప్రధానమంత్రి హోదాలో మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి.. 33వేల ఎకరాలు ఇచ్చిన 29వేల ఎకరాల రైతులకు… క్షోభ తప్పని సరి. రాష్ట్ర రాజధానికి భూములు ఇస్తున్నామని గర్వంగా ఫీలయిన వారు ఇప్పుడు.. రోదనలతో రోడ్లెక్కుతున్నా.. పాలకులకు… కనిపించని పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close