క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు మ‌రోసారి టెస్ట్ చేయిస్తే… క‌రోనా నెగిటీవ్ అని తేలింది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో ధృవీక‌రించారు. ”రెండు వారాల క్వారెంటైన్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతానికి ఎలాంటి ల‌క్ష‌ణాలూ లేవు. క‌రోనా టెస్టులు చేయిస్తే.. నెగిటీవ్ వ‌చ్చింది. ప్లాస్మా డొనేష‌న్ కోసం మ‌రో మూడు వారాలు ఎదురు చూడ‌మ‌ని వైద్యులు సూచించారు” అంటూ ట్వీట్ చేశారు.

రాజ‌మౌళి కుటుంబం క‌రోనాని జ‌యించ‌డం సినీ అభిమానుల‌కు ఊర‌ట‌నిచ్చే విష‌యం. మ‌రీ ముఖ్యంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం ఎదురుచూస్తున్న‌వాళ్ల‌కు. రాజ‌మౌళి అనారోగ్యం నుంచి కోలుకుని.. ఈ సినిమాని త్వ‌ర‌గా సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని అభిమానులు భావిస్తున్నారు. కాక‌పోతే.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డం అంత తేలికైన విష‌యం కాదు. సెప్టెంబ‌రు వ‌ర‌కూ.. చిత్ర‌బృందం అంత ధైర్యం చేయ‌క‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close