ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా మ‌రింత వినోదాన్ని అందిస్తుంద‌ని అల్లు అర‌వింద్ ధీమాగా చెబుతున్నారు. చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామ‌ని, 42 షోలు రాబోయే రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయ‌ని అల్లు అర‌వింద్ చెప్పారు.

“రెండు మూడేళ్ల‌లో పెద్ద పెద్ద స్టార్స్ అంతా ఓటీటీలోకి వ‌చ్చేస్తారు. చిరంజీవితో ఓ వెబ్ సిరీస్ కోసం సంప్ర‌దిస్తున్నాం. క‌థ న‌చ్చితే చాలు. ఆయ‌న న‌టిస్తారు. ఆహా నుంచి 42 షోలు రాబోతున్నాయి. వ‌చ్చే యేడాది జూన్ నాటికి… దాదాపు అన్నీ షోస్ మొద‌లైపోతాయి. ఎక్కువ‌గా వీకెండ్ వ‌చ్చేలా షోలు ప్లాన్ చేస్తున్నాం. కొన్ని షోస్‌ల‌లో అగ్ర‌తార‌లు క‌నిపిస్తారు” అంటూ ఆహా ప్లానింగ్ మొత్తం వివ‌రించారు. ఆహా జ‌నంలోకి బాగా వెళ్లిపోయింద‌ని, యేడాదిన్న‌ర‌లో రీచ్ అవ్వాల‌నుకున్న టార్గెట్ కేవ‌లం ఆరు నెల‌ల్లోనే అందుకున్నామ‌ని, త్వ‌ర‌లో ఆహా.. ఓ శ‌క్తిమంత‌మైన ఓటీటీ వేదిక‌గా మార‌బోతోంద‌ని అర‌వింద్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close