క్రైమ్ : ఆమెను 143 మంది రేప్ చేశారు..!

సాధారణంగా ఎవరైనా యువతి తనపై ఒకరు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తే..పోలీసులు వేగంగా రియాక్టవుతారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారంటే ఇంకా సీరియస్‌గా తీసుకుంటారు. కానీ.. తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారు..? . ఎలా స్పందించాలో తెలియక తికమకపడతారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులది ఇప్పుడు ఇదే పరిస్థితి. నల్లగొండ జిల్లాకు చెందిన యువతి పంజాగుట్టలో నివాసం ఉంటోంది. అనూహ్యంగా పోలీసుల ముందుకు ఈ ఫిర్యాదు చేసింది.

సాధారణంగా ఇలాంటి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు అమె మతి స్థిమితం మీద అనుమానపడతారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. చాలా వివరంగా.. తన ఫిర్యాదును పోలీసులకు ఇచ్చింది. దాదాపుగా వంద పేజీల ఫిర్యాదు పోలీసులకు ఇచ్చింది. తనపై సామూహిక అత్యాచారాలు, వేధింపులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగాయని తెలిపింది. అమె ఫిర్యాదు చేసిన వారిలో విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతో పాటు సినీ పరిశ్రమ వారూ ఉన్నారు.

యువతి కంప్లయింట్‌లో చెప్పిన వివరాల ప్రకారం..మి ర్యాలగూడకు చెందిన వ్యక్తితో 2009లో యువతికి వివాహం అయింది. కట్న వేధింపులు వేధింపులు తట్టుకోలేక 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది.రాజ్‌భవన్ రోడ్డులో నివాసం ఉంటూ చదువుకుంటూండగా..విద్యార్థి సంఘం నేతలు పరిచయమయ్యారు. అప్పటి నుంచి తనపై మాజీ ఎంపీ పీఏ, విద్యార్థి సంఘం నాయకులు ముగ్గురు, మరో 139 మంది కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఓ సారి అబార్షన్‌ చేయించారని నగ్నంగా చిత్రాలు, వీడియోలు తీశారు. సిగరెట్లతో కాలుస్తూ శారీరకంగా హింసించారని ఆమె చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి...

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

HOT NEWS

css.php
[X] Close
[X] Close