నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనల రూపంలో సాక్షికి ప్రజాధనం ప్రవాహం..!

హెరిటేజ్ కంపెనీ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిందని… అందులో అవకతవకలు జరిగాయని సీబీఐ విచారణ చేయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దానిపై హెరిటేజ్ కంపెనీ వివరణ ఇచ్చింది. టెండర్లలో పోటీ పడి దక్కించుకున్నామని… అదీ కూడా… చాలా కొద్ది చోట్ల మాత్రమే సరఫరా చేశామని వివరణ ఇచ్చింది. ఆ కంపెనీ చంద్రబాబు కుటుంబానికి చెందినది కాబట్టి… ప్రభుత్వం సీబీఐ విచారణ అంతటి సీరియస్ నిర్ణయం తీసుకుంది. అయితే… ఇప్పుడు.. ఆ నిబద్ధత… తన కంపెనీల విషయంలో ప్రభుత్వ పెద్దలు చూపించడం లేదు. నిబంధనలకు ఉల్లంఘించి ప్రకటనలను ముఖ్యమంత్రి సొంత మీడియాకు ఇచ్చారు. ఏడాది కాలంలో దాదాపుగా రూ. అరవై నుంచి 70 కోట్ల రూపాయాలు.. సాక్షికి ప్రకటన రూపంలో వెళ్లాయి. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రిక కంటే… దాదాపుగా ఇరవై శాతం ఎక్కువ ప్రకటనలు సాక్షికి వెళ్లడం ఇందులో అవినీతి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

ఆర్టీఐ చట్టం కిందట.. ఓ వ్యక్తి ప్రభుత్వం నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఖచ్చితంగా ఏడాది కాలంలో.. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా మొత్తం రూ. పదిహేడు కోట్ల రూపాయల ప్రకటనలు జారీ అయ్యాయి. ఇందులో రెండో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న సాక్షి పత్రికకు రూ. ఆరు కోట్లపైన వాటా ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇచ్చింది రూ. నాలుగు కోట్ల ఇరవై లక్షల ప్రకటనలు మాత్రమే. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక పేరును అసలు దాదాపుగా బ్యాన్ చేసేశారు. ఏడాది కాలంలో.. రూ. ఇరవై లక్షల ప్రకటనలు మాత్రమే ఇచ్చినట్లుగా చూపించారు. అదే సమయంలో ప్రజాశక్తి పత్రికకు రూ. కోటికిపైగా ప్రకటనలు వెళ్లాయి. ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్‌లకు కూడా… రూ. 60, 70 లక్షల వరకూ యాడ్స్ ఇచ్చారు.

పై వివరాలన్నీ.. ఒక్క ఐ అండ్ పీఆర్ రిలీజ్ చేసిన యాడ్స్ మాత్రమే.. కానీ… ఇతర డిపార్టుమెంట్లు విడివిడిగా తమ ఖాతాల ద్వారా.. ప్రకటనలు జారీ చేశారు. ఇలా అవి మొత్తం ఖర్చు పెట్టిన మొత్తం రూ. 82 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికకు సహజంగానే మెజార్టీ వాటా వెళ్లింది. దాదాపుగా రూ. 35 కోట్లు సాక్షి ఖాతాలోకి వెళ్లాయి. సర్క్యూలేషన్‌లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు రూ. 27 కోట్ల ప్రకటనలు వెళ్లాయి. సహజంగానే ఆంధ్రజ్యోతికి మొండి చేయి ఎదురైంది. రూ. నాలుగంటే నాలుగు లక్షల రూపాయల విలువైన ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. ఊరూపేరూ లేని పత్రికలకు … వస్తుందో రాదో అన్నట్లుగా ఉండే వార్తకు కూడా.. లక్షల్లో ప్రకటనలు ఇచ్చారు.

ఏ డిపార్టుమెంట్ ఎలా ప్రకటనలు ఇచ్చినా అది ప్రజాధనం. పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు.. తమ కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థలకు పిసరంతైనా మేలు చేయడానికి జంకుతారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపిండం లేదు. ముఖ్యమంత్రి సొంత పత్రికకు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు వెళ్లాయి. ఎక్కడైనా అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికకు అత్యధిక ప్రకటనలు ఇస్తారు. కానీ ఇక్కడ సాక్షికి ఎక్కువ ప్రకటనలు వెళ్లడంతోనే అవినీతి ఏంటో తేటతెల్లమవుతుంది. విశేషం ఏమిటంటే… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రకటన రేట్లను సాక్షి భారీగా పెంచేసింది.

కొద్ది రోజుల క్రితం.. జాస్తి క్రిష్ణకిషోర్ అనే అధికారిపై ప్రభుత్వం కేసులు పెట్టింది. దానికి చెప్పిన కారణం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేయడం. ఆయన అలా చేశారో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం… పక్కాగా అలాంటి ఉల్లంఘనలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో స్వయంగా ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి.. ఇప్పటికైతే ఇది నీతిగానే ఉంటుంది.. ప్రభుత్వం మారితే మాత్రం అవినీతిగా బయటకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close