పెద్ద బాల‌శిక్ష‌.. గులాబీ పువ్వు – హ‌రీష్ స్కెచ్ ఏమిటి?

ఈరోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా – ఫ్యాన్స్‌కి వ‌రుస‌గా స‌ర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. తొలుత వ‌కీల్ సాబ్ విచ్చేశాడు. ఆ త‌ర‌వాత‌.. క్రిష్ సినిమాలోని గ‌జ‌దొంగ ప్రీ లుక్ చూసే అవ‌కాశం వ‌చ్చింది. ఇప్పుడు.. హ‌రీష్ శంక‌ర్ సినిమాకి సంబంధించిన అప్ డేటూ వ‌చ్చేసింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ వ‌దిలింది చిత్ర‌బృందం. స్టైలీష్ బైక్‌, సీటుపై పెద్ద బాల‌శిక్ష పుస్తకం, ఓ గులాబీ పువ్వుతో ఆస‌క్తి పెంచేశాడు హ‌రీష్‌. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, సుభాష్ చంద్ర‌బోస్ ఫొటోలూ బ్యాక్ గ్రౌండ్ లో క‌నిపిస్తున్నాయి. `ఈసారి కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంటే కాదు..` అంటూ.. హ‌రీష్ హింట్ ఇచ్చేశాడు. మొత్తానికి హ‌రీష్ పెద్ద స్కెచ్చే వేసిన‌ట్టు ఉన్నాడు. ప‌వ‌న్ భావజాలాన్నీ, త‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని మిక్స్ చేసి ఈ క‌థ రాసుకున్న‌ట్టున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. మొత్తానికి గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ కానుంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close