టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారికి వీర్రాజు షాక్..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన టీంను ప్రకటించారు. గతంలోలా జంబో టీంను కాకుండా.. చాలా పరిమితంగా అంటే 40 మందితోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, నాగోతు రమేష్ నాయుడు వంటి వారే కాస్త బయట ప్రపంచానికి పరిచయం. మిగతా వారు జిల్లా స్థాయిలో కూడా.. పెద్దగా గుర్తింపు లేని నాయకులే. భారతీయ జనతా పార్టీలో అంతకు మించి ప్రజాబాహుళ్యంలో గుర్తింపు ఉన్న వారిని ఆశించడం కష్టమే కానీ.. సోము వీర్రాజు మాత్రం తనదైన ప్రత్యేకత చూపించారు. అదేమిటంటే.. కేవలం ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న వారిని.. తన భావజాలంతో సరిపడేవారికి మాత్రమే ప్రాధాన్యం కల్పించారు. అయితే బీజేపీలో పదవుల కోసం పోటీపడేవారు పెద్దగా లేరు. ఉన్నా… వారు అసంతృప్తికి గురైన పెద్దగా పోయేదేం లేదు.

సోము వీర్రాజు టీంలో కొట్టొచ్చినట్లుగా కనిపించిన మార్పు.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని పక్కన పెట్టడం. గత ఎన్నికల తర్వాత వివిధ కారణాలతో నేతలు బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో లంకా దినకర్, ఆదినారాయణ రెడ్డి, గోనుగుంట్ల సూర్యనారాయణ, సామినేని యాదిని సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరెవరికి కార్యవర్గంలో కనీసం చోటు దక్కలేదు. మంచి వాగ్ధాటి ఉన్న లంకా దినకర్‌ను సైతం పక్కన పెట్టేశారు. సాదినేని యామిని పరిస్థితి కూడా అంతే. ఆమెపై ప్రభుత్వం కేసులు పెట్టినా బీజేపీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ పదవి ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారు.. ఆ పార్టీ కోవర్టులని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. సాక్షి మీడియాలోనూ ప్రముఖంగా రాస్తూ ఉంటారు. వాటిని సోము వీర్రాజు బలంగా నమ్మినట్లుగా కనిపిస్తోంది.

వైసీపీ దాడుల నుంచి రక్షణలో… టీడీపీలో పరిస్థితులు బాగోలేకో… బీజేపీలో చేరిన వారికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ పరిస్థితి ఇక ముందు బీజేపీలో చేరాలనుకునేవారికి ఓ పాఠంలా ఉంటుందని .. ఎవరూ ముందుకు రారని.. బీజేపీలోని కొంత మంది నేతలు గొణుక్కుంటున్నారు. వలసల్ని నిలిపివేసి… టీడీపీ నుంచి బయటకు వెళ్లే వారెవరైనా ఉంటే వారు వైసీపీలోకే వెళ్లేలా సోము వీర్రాజు ఈ కొత్త కార్యకర్గానికి ప్లాన్ చేశారనే విమర్శలు ఆయన వ్యతిరేక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఎలా చూసినా.. సోము వీర్రాజు కార్యవర్గం వైసీపీనే కాదు.. టీడీపీని కూడా సంతృప్తి పరుస్తుంది. కానీ సొంత నేతల సంగతి మాత్రం సోము వీర్రాజుకే తెలియాల్సి ఉంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close