ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ వ‌ద్ద‌న్నా.. ఎన్టీఆర్ చేశాడు

ఓ హీరో కోసం అనుకున్న క‌థ‌, మ‌రో హీరో చేయ‌డం చిత్ర‌సీమ‌లో మామూలే. అలా కొన్ని వంద‌ల క‌థ‌లు చేతులు మారి ఉంటాయి. కానీ ఏ ఒక్క‌సంద‌ర్భంలోనూ.. `నేను ఆ క‌థ‌ని వ‌దులుకున్నా.. నువ్వు కూడా చేయ‌కు` అని సాటి హీరోకి మ‌రో హీరో చెప్ప‌లేదేమో. కానీ.. ఆ సంద‌ర్భం ఓసారి వ‌చ్చింది. అక్కినేని, ఎన్టీఆర్ విష‌యంలో.

1960 నాటి సంగ‌తి ఇది. బిఏ సుబ్బారావు అనే ద‌ర్శ‌కుడు `రాణీ ర‌త్న‌ప్ర‌భ` అనే క‌థ ప‌ట్టుకుని నాగేశ్వ‌ర‌రావు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఆ క‌థ నాగేశ్వ‌ర‌రావుకి పెద్ద‌గా న‌చ్చ‌లేదు. క‌థంతా దాదాపు క‌థానాయిక‌గా చుట్టూనే తిర‌గ‌డం అందుకు ఓ కార‌ణం. `ఇందులో అంజ‌లీదేవి పాత్రే ఎక్కువ క‌దా.. నేను చేయ‌డానికి ఏముంది` అంటూ నాగేశ్వ‌ర‌రావు ఆ సినిమాని తిర‌స్క‌రించారు. దాంతో సుబ్బారావు ఈ ప్రాజెక్టుని ఎన్టీఆర్ తో చేయాల‌ని ఫిక్స‌య్యారు. ఈ కాంబినేష‌న్‌లో `రాణీ ర‌త్న ప్ర‌భ‌` సినిమా వ‌స్తోంద‌న్న వార్త తెలిసి… ఎన్టీఆర్‌కి ఫోన్ చేశార్ట నాగేశ్వ‌ర‌రావు.

`బ్ర‌ద‌ర్‌.. రాణీ ర‌త్న ప్ర‌భ అనే సినిమా మీరు చేస్తున్నార‌ని తెలిసింది. ఆ క‌థ నాకూ వినిపించారు. నాకు ఏమాత్రం న‌చ్చ‌లేదు. మీ ఇమేజ్‌కి కూడా అది స‌రిప‌డ‌దు. ఈ సినిమా చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది` అని స‌ల‌హా ఇచ్చారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం `బిఏ సుబ్బారావు గారు నాకు బాగా కావ‌ల్సిన మ‌నిషి. ఇండ్ర‌స్ట్రీలో నేను అడుగుపెట్ట‌డానికి కార‌ణం ఆయ‌నే. నేను ఆయ‌న‌కు మాటిచ్చాను. ఈ ప‌రిస్థితుల్లో నేనిచ్చిన మాట వెన‌క్కి తీసుకోలేను` అనేశారు.

ఇచ్చిన మాట ప్ర‌కారమే.. ఎన్టీఆర్ ఆ సినిమా చేసేశారు. షూటింగ్ అంతా అయిపోయింది. రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది.

రేపు ఈ సినిమా విడుద‌ల అన‌గా… ఆరోజు రాత్రి నాగేశ్వ‌ర‌రావు నిద్ర‌పోలేద‌ట‌. `బ్ర‌ద‌ర్‌కి ఈ సినిమా చేయొద్దని చెప్పా. ఆయ‌న చేశారు. ఇప్పుడు ఆ సినిమా ఆడుతుందా లేదా? ఆడితే నా జ‌డ్జిమెంట్ పోయిన‌ట్టే. ఆడ‌క‌పోతే.. బ్ర‌ద‌ర్ న‌ష్ట‌పోతారు..` అనే ఆలోచ‌న‌ల‌తో నిద్ర రాలేద‌ట‌.

తెల్లారి మార్నింగ్ షో అయ్యాక‌… త‌న‌కు అత్యంత న‌మ్మ‌క‌స్థుడైన ఓ థియేట‌ర్ య‌జ‌మానికి ఫోన్ చేసి.. `సినిమా రిజ‌ల్ట్ ఏమిటి` అని అడిగార్ట‌.

`సినిమా ఏం బాలేదండీ. ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కాదిది` అని చెప్పే వ‌ర‌కూ.. ఆయ‌న టెన్ష‌న్ ప‌డుతూనే ఉన్నార్ట‌. ఈ విష‌యాన్ని అక్కినేని త‌న ఆత్మ‌క‌థ‌లో రాసుకున్నారు. మ‌రో హీరో సినిమా కోసం ఓ హీరో ఇంత‌లా ఆలోచించ‌డం, అదీ ఆ స‌మ‌యంలో త‌న‌కు ఏకైక పోటీ దారుడి సినిమా గురించి ఆరాట ప‌డ‌డం విచిత్ర‌మే.

అయితే అక్కినేని మాట‌ల‌కు, చేష్ట‌ల‌కూ ఎన్టీఆర్ అభిమానులు మ‌రోలా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. `మా హీరో సినిమా ఎక్క‌డ హిట్ట‌యిపోతుందో అన్న భ‌యంతో.. అక్కినేనికి నిద్ర ప‌ట్టి ఉండ‌దు` అని చెప్పుకున్నారు. నిజానికి `రాణీ ర‌త్న ప్ర‌భ‌` చూడ‌ద‌గ్గ సినిమానే. పాట‌లు బాగుంటాయి. కాక‌పోతే… హీరోయిన్ డామినేష‌న్ ఎక్కువ‌. మ‌రో హీరో చేసుంటే.. ఇంకాస్త మంచి ఫ‌లితం వ‌చ్చేదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close