పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఇంకా ఏదో ఆశించారు కానీ.. ఇప్పటి వారి ఆశలు ఆడియాశలుగానే ఉండిపోతున్నాయి. కరోనా కారణం చెప్పి.. రెండు నెలల పాటు సగం…సగం జీతాలు కోత వేయడమే కాదు.. ఇవ్వాల్సిన డీఏలన్నీ పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు వాటి కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఇక పీఆర్సీ గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. అసలు డీఏలే ప్రభుత్వం ఇవ్వడంలేదు.. ఇక పీఆర్సీ ఇస్తుందా అని ఉద్యోగాలు నిట్టూరుస్తున్నారు.

పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం జీతం బకాయిలు చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఎప్పుడెప్పుడు చెల్లిస్తామో కూడా చెప్పింది. ఓ డీఏ కూడా ఇస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఏపీలో మాత్రం ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం… టీ , కాఫీలు ఇచ్చి బుజ్జగిస్తోంది. వచ్చే రెండు నెలల్లో బకాయిలు చేల్లిస్తామని.. ఓ డీఏ కూడా ఇస్తామని బేరాలు ఆడుతోంది. ఈ బేరాలు ఉద్యోగ సంఘాల నేతల్ని నిస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరిస్తోందేమిటని మథనపడుతున్నారు.

ఉద్యోగ సంఘాల నేతల్లో ఎక్కువ మంది ప్రభుత్వానికి సరెండర్ అయినట్లుగా మాట్లాడుతూండటంతో.. ఏం చేయాలో ఇతర ఉద్యోగులకు అర్థం కావడం లేదు. దసరా పండుగకు అయినా జీతం బకాయిలు ఇప్పిస్తారేమోనని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. అదే సమయంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. వారిని బుజ్జగించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నించకపోగా… గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని ఇప్పుడు నిధుల్లేవన్న కారణాలు చెబుతూ.. లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close