పీవీ సింధుకు ఏమైంది..?

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి ఏమైంది..? ఆమెపై ఇటీవల పెరిగిపోతున్న రూమర్స్‌కి .. తాజాగా ఆమె చేసిన రిటైర్మెంట్ ట్వీట్‌కు సంబంధం ఏమిటి..? . ఇప్పుడు క్రీడా ప్రేమికుల్లో ఇదే చర్చ జరుగుతోంది. పీవీ సింధు హఠాత్తుగా ఓ ట్వీట్ చేసింది. మొదటి పేజ్‌లో  ..ఐ రిటైర్ అని టైటిల్ పెట్టింది. దీంతో ఆమె రిటైర్ అవుతుందేమోనని అందరూ  అనుకున్నారు. కానీ మిగతా రెండు పేజీల్లో మాత్రం వేదాంతం వల్లించింది. తాను నెగెటివిటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే వచ్చే ఏడాది ఆసియా  కప్ వరకూ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఆడట్లేదని మాత్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో సింధుకు ఏమైందన్న చర్చ ప్రారంభమయింది. 

కొద్ది రోజుల కిందట.. గోపీచంద్‌తో పాటు తల్లిదండ్రులతోనూ పీవీ సింధు గొడవపడి లండన్ వెళ్లిపోయిందని ఓ ఇంగ్లిష్ పత్రికలో వార్త వచ్చింది. దాన్ని సింధు ఖండించింది. తన కోసం జీవితం త్యాగం చేసిన వాళ్లపై తానెందుకు అలుగుతానని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మెరుగైన ఫిట్ నెస్ కోసమే లండన్ వచ్చానని చెప్పుకుంది. అయితే సింధు ఫిట్ నెస్ కోసం లండన్ వెళ్లినా…  టోర్నీలు ఆడకూడదని నిర్ణయించుకోవడం ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలగడానికి కారణం అవుతోంది. 

తన నెగెటివిటీకి కారణంగా కరోనాను.. పీవీ సింధు చెబుతున్నారు. కానీ.. కరోనా సమస్య ఒక్క పీవీ సింధుకే ఎందుకు సమస్యగా మారిందనేది చాలా మందికి అర్థం కాని విషయం. అయితే.. పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్లో ఒత్తిడికి గురవుతున్నారని.. అందుకే.. రిటైర్మెంట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్ లాంటి ట్వీట్లు చేశారని అంటున్నారు. మొత్తానికి పీవీ సింధు విషయంలో.. సమ్ ధింగ్.. సమ్ ధింగ్ అనుకునే పరిస్థితి మాత్రం ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close