ట్రంప్ వర్సెస్ బిడెన్..! ఎవరికైనా వెంట్రుకవాసి విజయమే..! 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీ అంటే ఏమిటో నిరూపిస్తున్నాయి. ఎవరికి మేజిక్ మార్క్ దక్కుతుందో అంచనా వేయడం కష్టంగా మారుతోంది. కీలకమైన ఏడు రాష్ట్రాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మిగతా 43 రాష్ట్రాల్లో లెక్కింపు పూర్తయింది. అప్పటికి బిడెన్ 238 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ స్కోర్ 213 దగ్గర ఉంది. అయితే కౌంటింగ్ జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యత చూపిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో బిడెన్ ఆధిక్యత చూపిస్తున్నారు. ఎవరి వైపు ఓట్లు మొగ్గుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. 

ఇప్పటికే 238 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బిడెన్.. మరో 32 ఓట్లు పొందితే  అగ్రజుడైపోతాడు. దానికి ఆయనకు స్కోప్ ఉంది. నెవడా, విన్ కాన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో బిడెన్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కానీ ఆయన అధిక్యత స్వల్పమే.. ఒక శాతం.. రెండు శాతం మధ్య ఊగిసలాడుతోంది.   నెవడా, విన్ కాన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో గెలిస్తే.. బిడెన్‌కు కావాల్సిన 32 ఎలక్టోరల్ ఓట్లు వచ్చేస్తాయి. 

ట్రంప్‌కు ప్రస్తుతం 213 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఆయన మళ్లీ అధ్యక్షుడవ్వాలంటే.. 57 ఎలక్టోరల్ ఓట్లు కావాలి. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అలస్కా రాష్ట్రాల్లో ట్రంప్ లీడ్‌లో ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో గెలిస్తే ట్రంప్‌కు 54 ఓట్లు వస్తాయి. అంటే.. 267కి చేరుకుంటారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలు అటూ ఇటూ స్వింగ్ కాకుండా ఉంటే.. బిడెన్ అధ్యక్షుడవుతారు. కానీ.. చాలా స్వల్ప ఆధిక్యతలో బిడెన్ ఉన్న విన్ కాన్సిన్, మిచిగాన్, నెవడా రాష్ట్రాల్లో ఏ ఒక్కటి స్వింగ్ అయినా ట్రంప్ మళ్లీ అధ్యక్షుడవుతారు. 

ప్రస్తుతం ఎవరి వైపు మొగ్గు లేదు.  ఎవరికీ అడ్వాంటేజ్ లేదు. చివరి ఓటు లెక్కించే వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై అంచనా కు రావడం కష్టం. ఓవరాల్‌గా ఓట్లలో మాత్రం… బిడెన్ స్పష్టమైన ఆధిక్యత చూపిస్తున్నారు. పోలైన ఓట్లలో యాభై శాతానికిపైగా ఆయనకు దక్కాయి. ట్రంప్‌కు 48.3 శాతమే వచ్చాయి.

ఫలితాలొచ్చిన తర్వాత కూడా.. న్యాయపోరాటం చేస్తామని ఇరువురు అభ్యర్థులు ప్రకటించారు. ఒక వేళ అలాగే కోర్టుకెళితే …  అధ్యక్ష ఎన్నిక ఫలితం ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close