అమర జవాన్ “బాబూరావు” సాయానికి అర్హుడు కాడా..!?

బాబూరావు, ప్రవీణ్ కుమార్ రెడ్డి. బాబూరావు ఉత్తరాంధ్రకు చెందిన సైనికుడు. ప్రవీణ్ కుమార్ రెడ్డి రాయలసీమకు చెందిన సైనికుడు. ఇద్దరూ గుండెల నిండా దేశభక్తి నింపుకుని సైన్యంలో చేరారు. ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో తెలియని సరిహద్దుల్లో విధులు నిర్వహించారు. అయితే విధి వారిని వెక్కిరించింది. ఉగ్రవాదల దాడుల్లో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకే సారి కాదు.. అక్టోబర్‌లో బాబూరావు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందాడు. నవంబర్‌లో ప్రవీణ్ కుమార్ రెడ్డి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇద్దరిదీ ప్రాణత్యాగమే.

కానీ చనిపోయిన తర్వాత వారికి లభించిన గౌరవంలో మాత్రం చాలా తేడా ఉండి. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన వీరజవాన్‌ బాబురావు కుటుంబానికి..ముఖ్యమంత్రి కనీసం ఒక సంతాప సందేశం కూడా పంపలేదు. కనీసం సాయం కూడా చేయలేదు. స్థానిక యువకులు.. ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున వీర జవాన్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు . అప్పుడే ప్రభుత్వం అమర జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని.. ఆయన భార్యకు గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే ప్రభుత్వం స్పందించలేదు.

అదే సమయంలో మరో వీర జవాన్ సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి మృతిపై ప్రభుత్వం తల్లిఢిల్లింది. ముఖ్యమంత్రి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ప్రత్యేకంగా లేఖ రాశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు అధికారులు వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్రారు.

వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఇచ్చిన గౌరవం.. సాయం.. ధైర్యం.. బాబూరావు కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదనే మౌలికమైన ప్రశ్న వస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అదే ప్రశ్నిస్తున్నారు. వీరజవానుల మరణాల్లో కూడా కులాన్ని బట్టి సాయం చేయడం.. వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని మండి పడ్డారు. ప్రభుత్వం వివక్ష ఎందుకు చూపిందో చెప్పకపోవచ్చు కానీ.. ప్రజల మనసుల్లో ఉండిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close